మరదళ్ళనే మనువాడిన మన హీరోలు వీరే..!

జీవితంలో పెళ్లి అనేది ముఖ్య ఘట్టం.ఇక స్టార్ హీరోల పెళ్లి, వారు చేసుకున్న జీవిత భగస్వామి గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. మన హీరోలలో కొందరు సొంత మరదళ్ళనే పెళ్లి చేసుకున్నారు. ఈ తరం హీరోలలో చాలా మంది పెద్దల అనుమతితో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ సొంత మరదళ్ళను చేసుకోలేదు. చరణ్, బన్నీ, మంచు విష్ణు వంటి హీరోలు కులాంతర వివాహాలు చేసుకున్నారు కానీ సొంత మరదళ్ళను చేసుకోలేదు. ఐతే ఒకప్పటి టాప్ స్టార్స్ తమ సొంత మరదళ్ళను పెళ్లి చేసుకున్నారు. అప్పటి సాంప్రదాయ పద్ధతులు విధానాలు అలాంటివి మరి. తమ సొంత మరదళ్ళనే చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో చూసేద్దామా…

ఎన్టీఆర్: వెండితెర వేలుపుగా వెలుగొందిన నందమూరి తారక రామారావు పెళ్లి చేసుకుంది సొంత మరదలినే. బసవతారకం ఎన్టీఆర్ కి సొంత మరదలి వరుస అవుతుంది. ఆయన 1942లో ఆమెను పెళ్లాడారు. అప్పటికి ఎన్టీఆర్ వెండి తెరకు పరిచయం కాలేదు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారట. ఆర్ధికంగా ఎన్టీఆర్ కుటుంబం ఉన్నతంగా లేనప్పటికీ బసవతారకం ఒత్తిడితోనే ఆమె తండ్రి ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి చేశారట.

ఏ ఎన్ ఆర్ : ఎన్టీఆర్ సమకాలికుడు టాలీవుడ్ మరో కన్నుగా భావించే అక్కినేని నాగేశ్వరావు కూడా సొంత మరదలినే పెళ్లి చేసుకున్నారు. ఆయన అన్నపూర్ణమ్మను 1949లో పెళ్లాడడం జరిగింది. అప్పటికే సినిమా హీరోగా ఆయన 10సినిమాల వరకు నటించారు.అయినప్పటికీ హీరోగా పెద్దగా గుర్తింపు రాలేదు. దానితో అన్నపూర్ణమ్మ నాన్నగారు సినిమాలంటూ తిరిగే వాడికి నా కూతురిని ఇవ్వను ససేమిరా అన్నారట. ఎలాగైతే నేమి ఏ ఎన్ ఆర్ మామను ఒప్పించి, మరదలి చేయి అందుకున్నారు.

కృష్ణ : ఎన్టీఆర్, ఏ ఎన్ ఆర్ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ సైతం సొంత మరదలు ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. 1961లో వీరి వివాహం జరిగింది. అప్పటికి కృష్ణ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. 1965లో ఆయన నటించిన తేనే మనసులు విడుదల అయ్యింది. కృష్ణ నటి విజయ నిర్మలను కూడా పెళ్లాడిన సంగతి తెలిసిందే.

మోహన్ బాబు : విలన్ గా వెండి తెరకు పరిచయమై కలెక్షన్ కింగ్ గా ఎదిగారు మోహన్ బాబు. మోహన్ బాబు కూడా సొంత మరదలినే పెళ్లిచేసుకున్నారు. ఆయన తన మరదలు విద్యా దేవిని పెళ్లిచేసుకున్నారు. ఆమె హఠాన్మరణం తరువాత ఆమె సొంత చెల్లెలు నిర్మలా దేవిని చేసుకున్నారు. దశాబ్దాలుగా వీరిది అన్యోన్య దాంపత్యంగా ఉంటూ వస్తుంది.

ఆది : సాయి కుమార్ నటవారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ వివాహం ఆడింది సొంత మరదలినే. సాయి కుమార్ భార్య తమ్నుడి కూతురిని ఆది పెళ్లి చేసుకున్నారు. వీరిది చిన్నప్పుడే పెద్దలు నిర్ణయించిన వివాహమట.

కార్తీ: తెలుగు వారికి బాగా సుపరిచితుడు హీరో కార్తీ సొంత మరదలు రజిని అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు. రజిని ఎం ఏ లిటరేచర్ గోల్డ్ మెడలిస్ట్ అని సమాచారం.

శివ కార్తికేయన్ : రెమో చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో శివ కార్తికేయ మరదలు ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus