Anjali: పెళ్లి వార్తలపై ఘాటుగా రియాక్ట్ అయిన అంజలి!

  • January 12, 2024 / 03:33 PM IST

సినీనటి అంజలి పరిచయం అవసరం లేని పేరు ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సీతగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అంజలి ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక గతంలో ఈమె నటించిన గీతాంజలి అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా గీతాంజలి మళ్లీ వచ్చింది

అనే టైటిల్ తో మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే గతంలో అంజలి గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి ఈమె తమిళ హీరో జై తో ప్రేమలో ఉన్నారని అయితే ఆయన తనని మోసం చేశారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఈమె బిజినెస్ మెన్ పెళ్లి చేసుకుని అమెరికాలో కూడా స్థిరపడింది అంటూ తన పెళ్లి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇలా తన పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈమె ఇటీవల మీడియా సమావేశంలో పెళ్లి వార్తలపై స్పందించారు.నాకు తెలియకుండానే నాకు చాలాసార్లు మీరే పెళ్లిళ్లు చేశారని ఈమె కామెంట్లు చేశారు. జై తో ప్రేమలో ఉన్నానని, బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకొని అమెరికాలో స్థిరపడ్డాను అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను చూసిన ప్రతిసారి నాకు నవ్వొస్తుందని ఈమె తెలిపారు. నాకు తెలియకుండానే నాకు ఇంత మందితో ఇన్నిసార్లు పెళ్లి చేస్తున్నారా అని ఆశ్చర్యపోయాను అంటూ పరోక్షంగా ఈమె (Anjali) పెళ్లి వార్తలపై తనదైన శైలిలో స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus