Anjali: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!

  • April 9, 2021 / 01:22 PM IST

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. బాలీవుడ్ లో రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ లాంటి స్టార్లకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. టాలీవుడ్ లో కూడా కోవిడ్ కేసులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా నటి అంజలికి కరోనా బారిన పడిందని వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో నిజం లేదని అంజలి క్లారిటీ ఇచ్చింది. కొన్ని వెబ్ సైట్స్ లో తనకు కరోనా సోకినట్లు వార్తలు ప్రచురించారని..

కానీ తనకు కరోనా సోకలేదని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు అంజలి స్టేట్మెంట్ ఇచ్చింది. పరీక్షల్లో తనకు పాజిటివ్ వచ్చిందంటూ వస్తోన్న కథనాల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషన్స్ కోసం కొన్ని రోజుల క్రితం దర్శకుడు వేణుశ్రీరామ్ తో కలిసి అంజలి, అనన్య, నివేదా థామస్ లు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలు ఇచ్చిన కొన్ని రోజులకే తనకు కరోనా సోకినట్లు నివేదా థామస్ ప్రకటించింది.

అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా రాలేదు. ఇదే సమయంలో అంజలికి కూడా కరోనా సోకిందంటూ పుకార్లు వ్యాపించాయి. రెండు రోజులుగా ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో అంజలి స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చింది. ఇక ఈరోజు విడుదలైన ‘వకీల్ సాబ్’ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమలో అంజలి క్యారెక్టర్ చాలా ఎమోషనల్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus