జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినీ పరిశ్రమ ఏమైపోతుందా అని అంతా ఆందోళన చెందారు. కానీ మన తెలుగు సినీ పరిశ్రమ మాత్రం బాగానే కోలుకుంది. ఆ వెంటనే కోలీవుడ్ కూడా గాడిలో పడింది.ఇప్పటి వరకూ విడుదలైనవి మీడియం రేంజ్ సినిమాలే అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి.అందుకే ఓటిటిలో విడుదల కావాల్సిన చాలా సినిమాలు.. థియేటర్లలోనే విడుదలవుతున్నాయి. జనవరిలో ‘క్రాక్’, ఫిబ్రవరిలో ‘ఉప్పెన’, మార్చిలో ‘జాతి రత్నాలు’ వంటి చిత్రాలు అసాధారణమైన కలెక్షన్లను సాధించి డబుల్ బ్లాక్ బస్టర్లు గా నిలిచాయి. అయితే ఇప్పుడు ఇవే సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వీటి రీమేక్ హక్కులను కొనుగోలు చెయ్యడానికి అక్కడి బడా నిర్మాతలు ఎగబడుతున్నారు.

కేవలం ఈ సినిమాలు మాత్రమే కాదు.. బాలీవుడ్లో ఇంకా చాలా సౌత్ సినిమాలు రీమేక్ కాబోతున్నాయి. అయితే వాటిలో ఎక్కువగా తెలుగు సినిమాలే ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకీ బాలీవుడ్లో రీమేక్ కాబోతున్న సౌత్ సినిమాలు ఏంటో.. ఓ లుక్కేద్దాం రండి :

1) జాతి రత్నాలు: తెలుగులో ఈ చిత్రం కొన్న బయ్యర్లకు మూడింతల లాభాలు దక్కాయి.ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ ను చెయ్యడానికి దర్శకుడు అనుదీప్ కూడా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నుండీ బడా దర్శకనిర్మాతలు నిర్మాత నాగ్ అశ్విన్ ను సంప్రదిస్తున్నారట.

2) ఉప్పెన: థియేటర్లు తెరుచుకున్న తరువాత అత్యథిక కలెక్షన్లను నమోదు చేసిన చిత్రంగా ‘ఉప్పెన’ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీ మరియు తమిళ భాషల్లో రీమేక్ చెయ్యబోతున్నట్టు సమాచారం. అందుకు ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట.

3) క్రాక్: అజయ్ దేవగన్ తో దర్శకుడు గోపీచంద్ మలినేనినే ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు.

4) మాస్టర్: విజయ్, విజయ్ సేతుపతిల రీసెంట్ హిట్.. ‘మాస్టర్’ ను కూడా అక్కడ రీమేక్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు.

5) ఆకాశం నీ హద్దురా: ఓటిటిలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ కూడా బాలీవుడ్లో రీమేక్ కాబోతుంది.

6) జులాయి: బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ కూడా బాలీవుడ్లో రీమేక్ కాబోతుంది.

7) ఇస్మార్ట్ శంకర్: రామ్- పూరి కాంబినేషన్లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ ను కూడా బాలీవుడ్లో రీమేక్ చెయ్యబోతున్నారు.

8) ఊసరవెల్లి: ఎన్టీఆర్ -సురేంద్ర రెడ్డి కాంబినేషన్లో వచ్చిన యావరేజ్ మూవీ ఇది. దీనిని కూడా బాలీవుడ్లో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

9) అల వైకుంఠపురములో: బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’..! దీనిని కూడా బాలీవుడ్లో రీమేక్ చెయ్యబోతున్నారు.

10) జెర్సీ: నేషనల్ అవార్డుని సాధించిన ‘జెర్సీ’ మూవీ హిందీ షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ కాబోతుంది.

11) అరుంధతి: 11 ఏళ్ళ తరువాత ఈ బ్లాక్ బస్టర్ మూవీ హిందీలో రీమేక్ కాబోతుంది. అల్లు అరవింద్ గారు ఈ చిత్రాన్ని అక్కడ రీమేక్ చెయ్యబోతున్నారు.

12) ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ: ఔట్ అండ్ ఔట్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ కూడా హిందీలో రీమేక్ కాబోతుంది.

13) దువ్వాడ జగన్నాథం- డిజె: అల్లు అర్జున్- హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన యావేరేజ్ మూవీ..! ఇది కూడా హిందీలో రీమేక్ కాబోతుంది.

14) భాగమతి: అనుష్క నటించిన సూపర్ హిట్ మూవీ ‘భాగమతి’ హిందీలో ‘దుర్గావతి’ పేరుతో రీమేక్ అయ్యింది. అక్కడ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించింది. ఓటిటి లో విడుదలైన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి.

15) హిట్: నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘హిట్’. రాజ్‌కుమార్ రావు హీరోగా ఇది హిందీలో రీమేక్ కాబోతుంది.

16) టాక్సీవాలా: విజయదేవరకొండ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘టాక్సీవాలా’ కూడా హిందీలో రీమేక్ కాబోతుంది.

17) మత్తు వదలరా: కీరవాణి కొడుకు సింహా హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ.. ‘మత్తు వదలరా’ కూడా హిందీలో రీమేక్ కాబోతుంది.

18) ఎఫ్2: అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ.. ప్రస్తుతం బాలీవుడ్లో రీమేక్ కాబోతుంది.

19) బ్రోచేవారెవరురా: శ్రీవిష్ణు నటించిన సూపర్ హిట్ మూవీ ‘బ్రోచేవారెవరురా’ కూడా హిందీలో రీమేక్ కాబోతుంది.

20) ఖైదీ: కార్తీ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’ కూడా హిందీలో అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus