జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవయాని కాంబినేషన్ లో తెరకెక్కిన సుస్వాగతం సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 1998 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దేవయాని 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. దేవయాని అసలు పేరు సుష్మా అనే సంగతి తెలిసిందే. దేవయాని కుటుంబం గురించి చాలామందికి తెలియదు.
దేవయాని (Devayani) నిరుపేద కుటుంబంలో ముంబైలో జన్మించారు. దేవయాని తల్లి గృహిణి కాగా తండ్రి ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా పని చేసేవారు. దేవయానికి ఇద్దరు సోదరులు కాగా వాళ్లు కూడా సినిమా రంగంలో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల దేవయాని పదో తరగతితోనే చదువుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. దేవయని ఒక సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా నటించగా 100 రూపాయలు వచ్చాయి.
16 సంవత్సరాల వయస్సులో దేవయానికి మూవీ ఆఫర్ రాగా ఆమెపై కాస్టింగ్ కౌచ్ ప్రభావం ఎక్కువగా పడిందట. కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా దేవయాని ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదు. కొన్ని సినిమాలలో రొమాంటిక్, బోల్డ్ రోల్స్ లో సైతం దేవయాని నటించారు. ఆ తర్వాత దేవయాని కోలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 2001 సంవత్సరంలో ప్రముఖ డైరెక్టర్ రాజ్ కుమార్ ను ఆమె వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గడంతో దేవయాని బుల్లితెరపై దృష్టి పెట్టారు. బుల్లితెరపై రోజుకు లక్ష రూపాయల రేంజ్ లో ఆమె పారితోషికం అందుకున్నారు. అయితే దేవయాని భర్త దర్శకత్వంలో పలు సినిమాలను నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు. ఆ తర్వాత కొంతకాలం పాటు దేవయాని టీచర్ గా కూడా పని చేశారు. ప్రస్తుతం సినిమాలలో నటిస్తున్న ఈ నటి పారితోషికం కేవలం 10,000 రూపాయలు అని తెలుస్తోంది.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !