మలయాళంలో అనేక చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించిన నటి, ప్రముఖ మోడల్ ధన్య మేరీ వర్గీస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమెకు సంకెళ్లు వేశారు. తమిళ సినిమా ‘తిరుడి’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన నటనతో తొలి సినిమాకే ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత మళయాల సినిమాల్లో బిజీ అయినా ఈమె, మోడలింగ్ రంగంలోనూ 2012 వరకు హావ కొనసాగించింది. సినీ నటుడు జాన్ ని పెళ్లి చేసుకోవడంతో సినిమాలకు దూరమయింది.
భర్తతో కలిసి శాంసన్ అండ్ సన్స్ సంస్థ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తృతం చేసింది. ఆమెకున్న ఫాలోయింగ్ ని ఉపయోగించుకొని కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.100కోట్లు సేకరించి ముఖం చాటేసింది. దీంతో బాధితులు ధన్యపై 2014లో చీటింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆరోపణలు వాస్తవమని భావించారు. కొన్ని రోజులుగా గాలించి ధన్య దంపతులను నేడు పట్టుకున్నారు. అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో మల్లూవుడ్ లో కలకలం రేగింది. ఈ మోసం వెనుక ఎంతమంది హస్తం ఉందోనని ఆందోళన మొదలైంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.