తరుణ్ భాస్కర్(Tharun Bhascker) టాలీవుడ్లో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్. కానీ ఈయన దృష్టి డైరెక్షన్ కంటే ఎక్కువగా నటనపైనే ఉందని చెప్పాలి. వరుసగా ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉన్నారు. హీరోగా కూడా సినిమాలు చేస్తున్నారు. కానీ అవి సక్సెస్ అవ్వడం లేదు. అయినప్పటికీ స్నేహితులు ఇతనికి ఎంతో కొంత మార్కెట్ ఉంది కాబట్టి హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నారు. పైగా తరుణ్ రైటింగ్ కూడా బాగుంటుంది కాబట్టి.. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పాలి.
మరో 2 రోజుల్లో తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించింది. ఈమెతో తరుణ్ భాస్కర్ డేటింగ్లో ఉన్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వీటిపై తరుణ్ భాస్కర్ ఓపెన్ అయిపోయాడు.
‘ఈ సినిమాలో ఈషా రెబ్బాని హీరోయిన్ గా ఎంపిక చేసినప్పటి నుండి రకరకాల వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. వాటికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం ఏమైనా చేయొచ్చు కదా.?’ అంటూ యాంకర్ ప్రశ్నించాడు. అందుకు తరుణ్ భాస్కర్…”నేను సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. అందుకే గోప్యంగా వ్యవరిస్తూ వచ్చాను.ఈషా నాకు స్నేహితురాలికంటే ఎక్కువ.. నాకు మంచి కంపేనియన్ అని కూడా చెబుతాను.
కొన్నేళ్లుగా మేము ఎంతో సన్నిహితంగా ఉంటున్నాం. అందులో చెప్పడానికి.. దాచడానికి ఏమీ లేదు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. నేను హడావిడిగా చెప్పేస్తే.. అది మిగిలిన వాళ్లకి ఎలా అర్ధమవుతుందో.. వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారో.. అనేది కూడా ఉంటుంది. కాబట్టి కాలిక్యులేటివ్ మూవ్ ఉండాలని భావిస్తున్నాను. చెప్పడం వల్ల నాకైతే ఏమీ కాదు. బర్రె తోలు మీద ఎండపడినా, వానపడినా ఏముండదు(నవ్వుతూ) అని నేను నమ్ముతాను” అంటూ చెప్పుకొచ్చాడు.
సో ఈషాతో రిలేషన్ షిప్ వ్యవహారాన్ని తరుణ్ కన్ఫర్మ్ చేసినట్టే. అంతేకాదు త్వరలో గుడ్ న్యూస్ చెప్పే అవకాశం కూడా ఉంది.