దేశముదురు సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆపిల్ బ్యూటీ హన్సిక మొత్వాని గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ గతంలో ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం ఆమె కోసమే ప్రత్యేకంగా థియేటర్స్ కు వెళ్లేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఆమె బ్యూటీని డామినేట్ చేసేవారు కూడా చాలా మంది వచ్చారు. ఇక మెల్లగా ఫేడౌట్ అయిపోతుంది అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి.
ఇక ఆ కామెంట్స్ ఎన్ని వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హన్సిక తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. సోలో హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ పోయినప్పటికీ ప్రస్తుతం కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అయితే ఎంతో కొంత బిజీ గానే కనిపిస్తుంది. అయితే 2019లో చివరగా నటించిన తెనాలి రామకృష్ణ BABL బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో ఏమి సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ బ్యూటీ ఆ సినిమా తరువాత మళ్ళీ వెండితెరపై కనిపించలేదు.
వెండితెరపైకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇక సిద్ధంగా ఉన్న మహా సినిమా విడుదల అవుతుందో లేదో అనే సందేహాలు కూడా చాలానే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అన్నీ అనుకూలిస్తే ఈ ఏడాది ఒకేసారి తొమ్మిది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది. లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయని చెప్పిన హన్సిక ఈ ఏడాది మాత్రం తప్పకుండా విభిన్నమైన కథలతో డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలారిస్తానని చెబుతోంది.
ప్రస్తుతం రెండు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం హన్సిక మూడు సినిమాలను పూర్తి చేసుకుంది. అలాగే మరొక 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి ఇక అందులో మహా తమిళ సినిమా పైనే హన్సిక ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందని హన్సిక అభిప్రాయపడుతోంది.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!