ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

గత రెండేళ్ళలో టాలీవుడ్లో చాలా పెళ్లిళ్లు అయ్యాయి. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడడం.. షూటింగ్లు క్యాన్సిల్ అవ్వడంతో టాలీవుడ్ సెలబ్రిటీలకి ఖాళీ సమయం దొరికింది. ఇక ఒకటే పనిగా ఇంట్లో వాళ్ళు పెళ్లి పెళ్లి అంటూ విసిగిస్తుంటే.. ఈ ఖాళీ సమయాన్ని ఆ పని కోసమైనా వాడుకుంటే బెటర్ అని చాలా మంది సినీ సెలబ్రిటీలు ఫిక్స్ అయిపోయారు. 2020 లో రానా, నిఖిల్, నితిన్.. వంటి హీరోలు.. ఇంకా చాలా మంది హీరోయిన్లు, నటీనటులు పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యారు. 2021 లో కూడా కొంతమంది నటీనటులు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) కార్తికేయ గుమ్మకొండ :

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కార్తికేయ.. ఈ ఏడాది లోహితా రెడ్డి అనే అమ్మాయిని పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

2) సుమంత్ అశ్విన్ :

స్టార్ ప్రొడ్యూసర్ యం.యస్.రాజు కొడుకు, ప్రముఖ హీరో అయిన సుమంత్‌ అశ్విన్‌ కూడా ఈ ఏడాది దీపిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

3) ప్రణీత :

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత కూడా ఈ ఏడాది ప్రముఖ బిజినెస్ మెన్ నితిన్‌ రాజుని వివాహం చేసుకుంది. బెంగళూరులో ఉన్న నితిన్‌ రాజు వ్యవసాయ క్షేత్రంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.

4) సునీత :

టాలీవుడ్ స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత కూడా మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది.

5) కత్రీనా కైఫ్ :

‘మల్లీశ్వరి’ ‘అల్లరి పిడుగు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన కత్రినా కూడా ఇదే ఏడాది.. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ను ప్రేమ వివాహం చేసుకుంది.

6) విద్యాల్లేఖా రామన్‌ :

టాలీవుడ్ లేడీ కమెడియన్ అయిన విద్యాల్లేఖా రామన్‌.. ఈ ఏడాది ప్రముఖ ఫిట్‌నెస్, న్యూట్రషనిస్ట్‌ అయిన సంజయ్ ను వివాహం చేసుకుంది.

7) ఆనంది :

‘జాంబీ రెడ్డి’ ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ ఆనంది కూడా ఇదే ఏడాది తమిళ సినిమాలకి కో డైరెక్టర్ గా పనిచేస్తున్న సోక్రటీస్‌ ను వివాహం చేసుకుంది.

8) జబర్దస్త్ అవినాష్ :

కమెడియన్ అవినాష్ కూడా ఇదే ఏడాది అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

9) యామి గౌతమ్ :

‘గౌరవం’ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన యామి గౌతమ్.. అటు తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ అక్కడ స్థిరపడిపోయింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, లిరిసిస్ట్ అయిన ఆదిత్య డర్ ను ఇదే ఏడాది వివాహం చేసుకుంది యామి.

10) దియా మీర్జా :

నాగార్జున హీరోగా నటించిన ‘వైల్డ్ డాగ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. ఇదే ఏడాది ప్రముఖ బిజినెస్మెన్ వైభవ్‌ రేఖీని రెండో పెళ్లి చేసుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus