Hansika: ఒకే పాత్రతో వైవిధ్యమైన సినిమా తీస్తున్నారట!

Advertisement

టాలీవుడ్‌లో ప్రయోగాలు అంటే భారీ చిత్రాలు, అగ్ర దర్శకులు, సూపర్‌ స్టార్లే చేయాలని లేదు. అయితే వాళ్లు చేస్తేనే అవి హైలైట్‌ అవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలా అని మిగిలిన వాళ్లు చేస్తూ ప్రయోగం కాకుండా పోదు, రికార్డు రాకుండా పోదు. తాజాగా ఇలాంటి ప్రయోగం చేయడాఇనికి హన్సిక సిద్ధమైంది. ‘105 మినిట్స్‌’ పేరుతో ఓ సినిమాలో నటిస్తోంది. ఒకే పాత్రతో రూపొందుతున్ ఈ సినిమాలో మరో స్పెషల్‌ కూడా ఉంది.

రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్స్‌ సెల్యూలాయిడ్‌ పతాకంపై బొమ్మక్‌ శివ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ హైదరాబా్‌లో మొదలైంది. ఇక ఇందులో స్పెషల్‌ ఏంటంటే… ఈ చిత్రాన్ని ఒకే ఒక్క షాట్‌లో పూర్తి చేస్తున్నారట. ఇండియన్‌ సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా ఇప్పటివరకు రాలేదని చిత్రబృందం చెబుతోంది. ఒక్క పాత్రతో చేసిన సినిమాలు చాలానే వచ్చినా… ఇలా సింగిల్‌ షాట్‌ సినిమా ఇదే తొలిసారి అట.

సినిమా చిత్రీకరణ సమయంలో ఎడిటర్‌ శ్యామ్‌ కూడా సెట్లోనే ఉంటూ చిత్రీకరణని పర్యవేక్షించారు. దాని ద్వారా సినిమా సింగిల్‌ షాట్‌లో పూర్తవ్వడానికి అవకాశం కలిగింది. మరి సినిమా ఎలా వచ్చింది, ఎప్పుడు వస్తుంది అనే విషయాలు త్వరలో చిత్రబృందం వెల్లడిస్తుంది. ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిదే కానీ… సరైన ప్లానింగ్‌తో విడుదల చేస్తే ఇంకా బాగుంటుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news