అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాలోని తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. ఇక ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యింది. ఇక ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమై కేవలం తమిళ సినిమాలలో మాత్రమే నటిస్తూ చాలా బిజీగా ఉంది.
ఇది ఇలా ఉండగా ఇటీవల సోహైల్ కతూరియా అనే వ్యాపారవేత్తను హన్సిక వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తన స్నేహితురాలి భర్తని హన్సిక ఇలా వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా కాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ కష్టపడి పెద్దల అంగీకారంతో ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వివాహం తర్వాత కూడా హన్సిక తన సినీ జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇక హన్సిక వివాహా వేడుకను లవ్ షాదీ డ్రామా పేరుతో డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా ఈ వివాహ వేడుకను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఇక పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమాలలో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇలా తరచూ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా..తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు హన్సిక ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
“వివాహం తర్వాత జీవితం ఎలా ఉంది.? ఏవైనా మార్పులు వచ్చాయా.? అని ఒక నెటిజన్ ప్రశ్నించగా హన్సిక బదులిస్తూ.. ‘లైఫ్ చాలా బాగుతుంది. ఇక పెళ్లి తర్వాత మారింది ఇంటి అడ్రెస్’ అంటూ తనదైన శైలిలో ఫన్నీగా బధులిచ్చింది. దీంతో హన్సిక చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!