బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ బయటపడడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ సమయంలో పబ్ లో ఉన్న నీహారిక కొణిదెల, రాహుల్ సిప్లిగంజ్ లతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు నటి హేమ పేరు కూడా వినిపించింది. ఆమె కూడా పార్టీలో ఉందని వార్తలొచ్చాయి.
దీంతో హేమ స్పందించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. తన పేరుని పలు ఛానెల్స్ లో ప్రసారం చేస్తున్నారని నటి హేమ ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తోన్న సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆదివారం మధ్యాహ్నం ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. కంప్లైంట్ చేయడానికి ముందు మీడియాతో మాట్లాడింది. తను అసలు పబ్ కే వెళ్లలేదని.. డ్రగ్స్ అనేది చిన్న విషయం కాదని చెప్పింది.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ కొందరు కావాలనే తన పేరుని ప్రసారం చేస్తున్నారని.. తనను బద్నాం చేస్తున్నారని వాపోయింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా చాలా సినిమాలు చేసింది. కానీ ఈ మధ్యకాలంలో అవకాశాలు తగ్గాయి. మధ్యలో బిగ్ బాస్ షోలో కనిపించింది. కానీ ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?