ప్రముఖ నటి భర్త మీద కేస్ పెట్టిన యువతి ఎవరంటే..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూ రచ్చ రచ్చ చేసే రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ మీద రేప్ కేస్ నమోదైంది.. రాఖీ గతకొద్ది రోజులుగా భర్త తనను మోసం చేశాడంటూ పలు ఆరోపణలు చేస్తూ మీడియా, సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఇటీవల తన భర్తతో ఎఫైర్ పెట్టుకున్న మహిళకు మాస్ వార్నింగ్ ఇచ్చింది రాఖీ. తను ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తిని తన నుండి దూరం చేసిందంటూ సదరు మహిళను కన్నీంటి పర్యంతమవుతూ హెచ్చరిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే..

తర్వాత భర్త మీద దొంగతనం కేసు పెట్టి అరెస్టు చేయించింది. ఆదిల్ పెళ్లి పేరుతో తన వద్దనున్న డబ్బు, బంగారం అంతా లాగేసుకున్నాడని.. ఇంటి తాళాలు కూడా ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నాడని.. పెళ్లి తర్వాత కూడా మరో యువతితో సంబంధం నడుపుతున్నాడు.. ఆ విషయం గురించి అడిగితే నాపై దాడి చేశాడు. నా తల్లి చికిత్సకు కూడా డబ్బులివ్వలేదు.. దీంతో ఆమె మరణించింది.. నా తల్లి చావుకి కారణం అతనే.. కష్టపడి పైకొచ్చిన నన్ను తను బాలీవుడ్‌లో పేరు సంపాదించుకోవడానికి వాడుకుని దారుణంగా మోసం చేశాడు..

నా నెంబర్ కూడా బ్లాక్ చేశాడు.. అని చెప్పుకొచ్చిందామె.. అయితే రాఖీని కలవడానికి వచ్చిన ఆదిల్‌ను కాపు కాసి అదుపులోకి తీసుకున్నారు బాంబే పోలీసులు.. కట్ చేస్తే.. రాఖీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆదిల్ మెడకు మరో కేసు చుట్టుకుంది. తనను అత్యాచారం చేశాడంటూ ఇరాన్ దేశానికి చెందిన ఓ యువతి కేసు పెట్టింది.. ఈ నేపథ్యంలో మైసూరులోని వివి పురం పోలీసు స్టేషనులో ఆదిల్ మీద ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే..

ఇండియాలో చదువుకోవడానికి వచ్చిన వచ్చిన ఇరాన్ యువతికి.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మైసూరులో సహజీవనం చేశాడు ఆదిల్.. పెళ్లి పేరుతో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని.. ఐదేళ్లుగా తనను దారుణంగా మోసం చేస్తూ వస్తున్నాడని.. ఈ విషయం బయటకు చెప్తే తనతో క్లోజ్‌గా ఉన్న పిక్స్ లీక్ చేసి జీవితం నాశనం చేస్తానని బెదిరించాడని తెలిపింది.. దీంతో ఆదిల్ ఖాన్ మీద చీటింగ్, బ్లాక్ మెయిల్, రేప్ తదితర ఆరోపణల కింద కేసు ఫైల్ చేశారు..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus