స్టార్ హీరోయిన్ ఇలియానా దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఇలియానాకు తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ కాగా ఆ సమయంలో ఈ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు వైరల్ అయిన సమయంలో ఇలియానా ఆత్మహత్యాయత్నం గురించి స్పందించలేదు. అయితే తాజాగా ఆ వార్తల గురించి ఇలియానా స్పష్టతనిచ్చారు. తాజాగా ఇలియానా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి వైరల్ అయిన ఫేక్ న్యూస్ గురించి మాట్లాడారు.
కొన్నేళ్ల క్రితం తన గురించి చాలా పుకార్లు ప్రచారంలోకి వచ్చాయని తాను అబార్షన్ చేయించుకుంటున్నానని ప్రచారం చేశారని ఆమె వెల్లడించారు. తన గురించి అలాంటి వార్తలు ప్రచారంలోకి రావడంతో తాను చాలా బాధ పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఇంత దారుణంగా ప్రచారం చేస్తారా..? అని తాను అనుకున్నానని ఇలియానా తెలిపారు. మరొకసారి తాను సూసైడ్ అటెంప్ట్ చేశానని ఆ ప్రయత్నాన్ని తన ఇంట్లో పని చేసే పనిమనిషి అడ్డుకున్నట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఇలియానా చెప్పుకొచ్చారు.
అయితే తన ఇంట్లో ఇంటిపని, వంటపని చేసేవాళ్లు ఎవరూ లేరని అలాంటి వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో తనకు అర్థం కాలేదని ఆమె చెప్పారు. తాను చచ్చిపోలేదని బ్రతికే ఉన్నానని తను జీవితంలో సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని ఇలియానా అన్నారు. తాను గర్భవతినని గతంలో వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇలియనా తెలిపారు.
Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!