ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

సినీ పరిశ్రమలో దర్శకుడిగా అవకాశం రావడం అంటే సాధారణ విషయం కాదు. నిర్మాత మరియు హీరో.. ఇక మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఎంతగానో నమ్మి ఆ బాధ్యతను దర్శకుడి చేతిలో పెడుతుంటారు. అలాంటప్పుడు తన మొదటి సినిమాతో ఆ దర్శకుడు కచ్చితంగా హిట్ కొట్టాలి. లేదంటే రెండో అవకాశం దక్కడం చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా నిర్మాతలు, హీరోలు.. ఆ దర్శకుడిని కలవడానికి కూడా ఇష్టపడరు. అయితే కొంతమంది దర్శకులకి మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందించకపోయినా రెండో సినిమా మాత్రం వారు కోరుకున్న ఫలితాన్ని ఇచ్చింది. దాంతో వాళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారనే చెప్పాలి. ఇంతకీ ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) వంశీ పైడిపల్లి :

ఇతని డెబ్యూ మూవీ ‘మున్నా’. ప్రభాస్ హీరోగా నటించిన ఆ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ అతను ఎన్టీఆర్ తో చేసిన రెండో మూవీ ‘బృందావనం’ మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

2) హరీష్ శంకర్ :

‘షాక్’ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు హరీష్ శంకర్. కానీ ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని అదే రవితేజతో ‘మిరపకాయ్’ అనే మాస్ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

3)శ్రీను వైట్ల :

ఇతని డెబ్యూ మూవీ ‘నీకోసం’. రవితేజ హీరోగా నటించాడు. కానీ ఇతనికి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘ఆనందం’ చిత్రమనే చెప్పాలి.

4) విక్రమ్ కుమార్ :

ఇతని డెబ్యూ మూవీ ‘ఇష్టం’. కానీ ఆ చిత్రం హిట్ అవ్వలేదు. అయితే నితిన్ తో చేసిన రెండో చిత్రం ‘ఇష్క్’.. ఇతనికి దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

5) ఇంద్రగంటి మోహన్ కృష్ణ :

ఇతని డైరెక్షన్లో వచ్చిన మొదటి చిత్రం ‘గ్రహణం’. అయితే ఆ సినిమా విడుదల కాలేదు.తరువాత ఇతనికి ఫాలోయింగ్ వచ్చాక యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి. అయితే.. అటు తరువాత ఇతను ‘మాయాబజార్’ అనే చిత్రం చేసాడు. దీనినే మొదటి సినిమాగా చెప్పుకోవాలి. కానీ ఇది అతనికి ఆశించిన స్థాయి ఫలితాన్ని అందించలేకపోయింది. అయితే రెండో సినిమా ‘అష్టా చమ్మా’ మాత్రం ఇతనికి దర్శకుడిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

6) సంపత్ నంది :

ఇతని డెబ్యూ మూవీ ‘ఏమైంది ఈ వేళ’.ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.. కానీ ఆ తరువాత వచ్చిన ‘రచ్చ’ తోనే ఇతనికి మంచి గుర్తింపు దక్కింది.

7) వేణు శ్రీరామ్ :

దర్శకుడిగా ఇతనికి మొదటి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’. కానీ ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం నానితో చేసిన ‘ఎం.సి.ఎ’ మూవీ అనే చెప్పాలి. ఇప్పుడు ఇతను ఏకంగా పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’ మూవీ చేసేస్తున్నాడు.

8) వివేక్ ఆత్రేయ :

ఇతని మొదటి చిత్రం ‘మెంటల్ మదిలో’. ఈ చిత్రానికి రిలీజ్ రోజున మంచి టాకే వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే అటు తరువాత వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రం హిట్ అయ్యి ఇతనికి మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది.

9) నాగ్ అశ్విన్ :

ఇతని మొదటి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ఈ చిత్రానికి రిలీజ్ రోజున మంచి టాకే వచ్చింది కానీ..దర్శకుడికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.అయితే రెండో చిత్రం ‘మహానటి’ తో మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టి ఇతని సత్తా ఏంటో చూపించింది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీ చేసేస్తున్నాడు.

10) కె.వి.అనుదీప్ :

ఇతని మొదటి చిత్రం ‘పిట్ట గోడ’. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ రెండో మూవీ ‘జాతి రత్నాలు’ బిగ్గెస్ట్ హిట్ అయ్యి.. బోలెడు లాభాలను తెచ్చిపెట్టడంతో ఇతను క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

11) హను రాఘవపూడి :

ఇతని మొదటి చిత్రం ‘అందాల రాక్షసి’ పెద్దగా ఆడలేదు.. అయితే రెండో చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ మాత్రం హిట్టయ్యి ఇతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

12) గౌతమ్ తిన్ననూరి :

ఇతని మొదటి చిత్రం ‘మళ్ళీ రావా’. ఆ చిత్రం డీసెంట్ హిట్ అనిపించుకుంది కానీ.. రెండో చిత్రం ‘జెర్సీ’ సూపర్ హిట్ అయ్యి ఇతనిని మరింత పాపులర్ చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus