Ileana: బేబీకి తండ్రి ఎవరు ఇలియానా… ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

  • May 4, 2023 / 07:42 PM IST

దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు గోవా ముద్దుగుమ్మ ఇలియానా. మొదటి సినిమాని ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం పోకిరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమె తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన ఇలియానా అనంతరం పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.

ఈమె నటించిన సినిమాలన్నీ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి ఇలా అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియా వేదికగా ఇలియానా అవకాశాలను అందుకోవడం కోసం పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఇలియానా తల్లి కాబోతున్నట్టు తన ప్రెగ్నెన్సీని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఇలియానా ఇలా పెళ్లి కాకుండానే తన బేబీ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ప్రెగ్నెన్సీ గురించి ప్రకటించడంతో ఒక్కసారిగా వార్తలలో నిలిచారు.

ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ని ప్రకటించడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఇలా తన ప్రేగ్నెన్సీని ప్రకటించిన తర్వాత ఇలియానా మొదటి సారి తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా ఇలియానా మొదటిసారి తన బేబీ బంప్ ఫోటో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటో పై నెటిజన్స్ కామెంట్ చేస్తూ అసలు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ తనపై ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెన్ మిచెల్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని కత్రినా దంపతులతో పాటు వీరిద్దరూ కూడా మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లి ఎంజాయ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలియానా ప్రెగ్నెన్సీకి కత్రినా సోదరుడే కారణమంటూ కూడా వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై (Ileana) ఇలియానా స్పందించలేదు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus