Actress Indraja: తన లవ్ మ్యారేజ్ గురించి చెప్పుకొచ్చిన సీనియర్ నటి ఇంద్రజ..!

Advertisement

ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఇంద్రజ.కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగిన ఈమె దాదాపు 80 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబంలో ఈమె జన్మించింది.ఇంద్రజ ఓ సింగర్ కూడా అన్న విషయం ఎక్కువ మందికి తెలిసుండదు. ఈమె అసలు రజతి అని కూడా ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ‘చిన్ని చిన్ని ఆశ’ ‘ సొగసు చూడతరమా’ ‘యమలీల’ ‘పెద్దన్నయ్య’ ‘ఒక చిన్నమాట’ వంటి సినిమాల్లో ఈమె నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే జబర్దస్త్ జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. తాజాగా ఈమె తన లవ్ మ్యారేజ్ గురించి తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం రూ.7500 తో ఇంద్రజ పెళ్లి జరిగిందట. 13 మంది పెళ్లి పెద్దలు వచ్చినట్టు ఆమె తెలియజేసింది. ఇంద్రజ భర్త పేరు.. మహ్మద్ అబ్సర్.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి వరకు దారి తీసింది.

ఇంద్రజ భర్త కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. రైటర్ గా, యాడ్ ఫిల్మ్ మేకర్ గా.. సీరియల్స్ కోసం పనిచేశారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం, ప్రేమ చిగురించింది. వీరి కుటుంబాల మధ్య బిజినెస్ డీల్స్ కూడా జరిగేవట. దీంతో వీరి మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా జరిగింది అని తెలుస్తుంది. ముస్లిం మతస్థుడుని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇంద్రజ బ్రాహ్మణ యువతి గానే ఉంది.‘‘ నేను నా మనసుకి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను..

అతను హిందూ.. ముస్లిం అని నేను చూడలేదు.. మతానికి మనసుకి నచ్చడానికి సంబంధం లేదు. మతాలతో సంబంధం లేకుండా ఒకరినొకరు ఇష్టపడ్డాం.. మతం చూసి, కులం చూసి ఇష్టపడితే అది ప్రేమ ఎలా అవుతుంది. నేను చెప్తే మూవీ డైలాగ్‌లా ఉంటుంది కానీ.. ఇది మాత్రం మూవీ డైలాగ్ కాదండోయ్.. ఇది నా రియల్ లైఫ్ కు దగ్గరగా ఉన్న డైలాగ్’’ అంటూ ఇంద్రజ ఈ విషయాలు చెప్పుకొచ్చింది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus