నాగార్జునతో నటించిన హీరోయిన్ ఇషా ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

సోషల్ మీడియా కారణంగా ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించి అలరించి ఫేడవుట్ అయిపోయిన నటీనటులను గురించిన సమాచారం తెలుస్తోంది.. టాలీవుడ్‌లో కెరీర్ స్టార్ట్ చేసి.. బాలీవుడ్‌లో స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన ఇషా కొప్పికర్ గుర్తుందా?.. ఈ ముంబై భామ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ మొదలెట్టింది.. పాపులర్ సోప్, కూల్ డ్రింక్ యాడ్స్ చేసింది.. తెలుగులో వినీత్, జె.డి. చక్రవర్తి నటించిన ‘వైఫ్ ఆఫ్ వర ప్రసాద్’ మూవీతో హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయింది.

నాగార్జునతో ‘చంద్రలేఖ’, వెంకటేష్‌తో పక్కన ‘ప్రేమతో రా’ (గెస్ట్ అప్పీరియన్స్) తర్వాత మళ్లీ కనిపించలేదు.. తమిళ్, కన్నడ, మరాఠీలోనూ యాక్ట్ చేసింది కానీ హిందీలో బాగా పాపులర్ అయింది.. వెబ్ సిరీసుల్లో కూడా ఆకట్టుకున్న ఇషా 13 ఏళ్ల తర్వాత నిఖిల్ సిద్దార్థ్ ‘కేశవ’ మూవీలో కనిపించింది.. ప్రీతి జింటా పరిచయం చేసిన టిమ్మీ నారంగ్ అనే వ్యక్తిని పెళ్లాడి ఓ పాపకు జన్మనిచ్చింది. తర్వాత రాజకీయాల్లోకీ దిగింది..

46 ఏళ్ల ఇషా కొప్పికర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పర్సనల్, ప్రొఫెషన్ అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది.. గ్లామరస్ పిక్స్ అండ్ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకునే ఈ సీనియర్ బ్యూటీని 1 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు..

 

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus