Gurthunda Seethakalam Review: గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • స‌త్యదేవ్ (Hero)
  • తమన్నా (Heroine)
  • సుహాసిని , మేఘా ఆకాష్ , కావ్య శెట్టి, ప్రియదర్శి (Cast)
  • నాగశేఖర్ (Director)
  • నాగ‌శేఖ‌ర్, భావ‌న‌ ర‌వి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు (Producer)
  • కాల భైరవ (Music)
  • సత్య హెగ్డే (Cinematography)
  • Release Date : డిసెంబర్ 09, 2022

“గాడ్ ఫాదర్, రామసేతు” చిత్రాలతో నటుడిగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గుర్తుందా శీతాకాలం”. కన్నడలో మంచి విజయం సాదించిన “లవ్ మాక్ టెయిల్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. మరి నటుడిగా విశేషమైన గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్, కథానాయకుడిగా ఆ స్థాయి విజయాన్ని అందుకోగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పటి నుంచి డిఫరెంట్ స్టేజస్ లో డిఫరెంట్ లవ్ పార్ట్నర్స్ తో నానా ఇబ్బందులు పడి.. చిట్టచివరికి తన మనసుకు నచ్చిన నిధి (తమన్నా)ను పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాడు దేవ్ (సత్యదేవ్). కట్ చేస్తే.. అప్పటివరకూ ఆనందంగా సాగుతున్న జీవితం అగాధంలో కూరుకుపోతుంది.
అసలు దేవ్ లవ్ జర్నీ ఎలా మొదలైంది? అతనికి ఎదురైన అడ్డంకులు ఏమిటి? తన లవ్ జర్నీలో ఎలా ముందుకు సాగాడు? అనేది “గుర్తుందా శీతాకాలం” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా సత్యదేవ్ కు పేరు పెట్టాల్సిన పని లేదు. అయితే.. కొన్ని పాత్రలు కొందరికి సెట్ అవ్వవు. అలా సత్యదేవ్ కి సూటవ్వని పాత్ర ఈ దేవ్. ముఖ్యంగా యంగ్ దేవ్ గా కనిపించడానికి, నటించడానికి సత్యదేవ్ చాలా కష్టపడ్డాడు, అది చూడ్డానికి ప్రేక్షకుడు ఇబ్బందిపడ్డాడు. అందువల్ల దేవ్ పాత్రకు జనాలు కనెక్ట్ అవ్వలేకపోయారు. మేఘా ఆకాష్, తమన్నా, కావ్యశెట్టిలు హీరోయిన్లుగా పర్వాలేదనిపించుకున్నారు. హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి మంచి కామెడీ డైలాగ్స్ తో అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడిగా కాలభైరవ తన మార్క్ ను ప్రతి సినిమాతో మిస్ చేసుకుంటున్నాడు. ముఖచిత్రం, గుర్తుందా శీతాకాలం చిత్రాలలో ఒక్క పాటతో ఆకట్టుకోలేకపోయాడు. అలాగే.. నేపధ్య సంగీతం విషయంలో కూడా అతని మార్క్ కనిపించడం లేదు. సత్య హెగ్డే సినిమాటోగ్రఫీ వర్క్ ఒక్కటే సినిమా మొత్తానికి సేవింగ్ గ్రేస్. విజువల్ గా “గుర్తుందా శీతాకాలం” ఆడియన్స్ కు కాస్త ఊరటనిచ్చింది.

దర్శకుడు నాగశేఖర్ కన్నడ వెర్షన్ లో ఎలాంటి మార్పులు చేయకుండా తెలుగులో సినిమా తీయడమే పెద్ద మైనస్. కన్నడ వెర్షన్ కు కథ, దర్శకత్వం అందించిన డార్లింగ్ కృష్ణ హీరోగానూ నటించడంతో.. అతడి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా సన్నివేశాలు రాసుకున్నాడు. కానీ.. నాగశేఖర్ తెలుగులో సత్యదేవ్ బాడీ లాంగ్వేజ్ & లుక్స్ కి తగ్గట్లు సన్నివేశాలను రాసుకోలేదు. అందువల్ల సినిమా మొత్తం చాలా బోరింగ్ గా ఉంటుంది. అలాగే.. సత్యదేవ్ పక్కన కనిపించిన ఒక్క హీరోయిన్ తో కూడా అతనికి కెమిస్ట్రీ వర్కవుటవ్వకపోవడమే కాక.. ఎవ్వరూ సూట్ కూడా అవ్వలేదు.

విశ్లేషణ: ఒక రీమేక్ సినిమాలో కనీస స్థాయి మార్పులు, చేర్పులు లేకపోతే వర్కవుటవ్వదు అనే విషయాన్ని పట్టించుకోకుండా తెరకెక్కించిన చిత్రం “గుర్తుందా శీతాకాలం”. సత్యదేవ్ కు ఈ తరహా లవర్ బోయ్ రోల్స్ సూట్ అవ్వవు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus