Panchathantram Review: పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నరేశ్‌ ఆగస్త్య ,రాహుల్ విజయ్ (Hero)
  • శివాత్మిక ,స్వాతిరెడ్డి (Heroine)
  • బ్రహ్మానందం , సముద్రఖని ,దివ్య శ్రీపాద, ఆదర్శ్ బాలకృష్ణ , శ్రీవిద్య (Cast)
  • హర్ష పులిపాక (Director)
  • అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు (Producer)
  • ప్రశాంత్‌ ఆర్‌. విహారి (Music)
  • రాజ్‌ కె. నల్లి (Cinematography)
  • Release Date : డిసెంబర్ 09, 2022

తెలుగులో ఈమధ్యకాలంలో ఆంథాలజీ సబ్జెట్ల వెల్లువ పెరిగింది. ఆ జోనర్ లో వచ్చిన తాజా చిత్రమే “పంచతంత్రం”. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి కీలకపాత్ర పోషించిన ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకుడు. అయిదు కథల సంపుటగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాణ సారధులు యువకులు కావడమే కాక.. మిక్కిలి నటీనటులు కూడా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఎదిగిన వారు కావడంతో ఈ ప్రొజెక్ట్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. మరి ఈ సినిమా వారి అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: మనిషి శరీరంలోని పంచేంద్రియాల నేపధ్యంతో తెరకెక్కిన అయిదు కథల సమాహారమే “పంచతంత్రం”. ఆ పంచేంద్రియాలేమిటి? ఆ కథలేమిటి అనేది చూద్దాం.

చూపు: ప్రేమించే తల్లిదండ్రులు, మూడంకెల జీతం ఇచ్చే ఉద్యోగం, మంచి స్నేహితులు.. ఉన్నప్పటికీ జీవితంలో మనశ్శాంతి లోపించి.. చాలా ఫ్రస్ట్రేటడ్ గా లైఫ్ లీడ్ చేస్తుంటాడు విహారి (నరేష్ అగస్త్య). తండ్రి ఎప్పుడో చిన్నప్పుడు ఇచ్చిన పోస్ట్ కార్డ్ లో ఉన్న బీచ్ కి బాగా అట్రాక్ట్ అవుతాడు. దేవుడి దయ వల్ల అనుకోకుండా పాండిచ్చేరి వెళ్ళడం, అక్కడ బీచ్ ను తన కళ్ల చూసి.. ఇసుకను కాళ్లతో ఫీలై అమితమైన సంతృప్తి చెందుతాడు.

రుచి: పెళ్లి అంటే క్లారిటీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తపించే యువకుడు సుభాష్ (రాహుల్ విజయ్). పెళ్ళిచూపుల్లోనే రాహుల్ ను ఇష్టపడిన అమ్మాయి లేఖ (శివాత్మిక రాజశేఖర్). ఈ ఇద్దరి జర్నీ హనీ కేక్ తో మొదలై.. బాదం మిల్క్ దగ్గర ప్రారంభమవుతుంది.

వాసన: కూతురు త్వరలో పండంటి బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో తండ్రి రామనాధం (సముద్రఖని)కి ఎందుకో ఇంటి దగ్గర చెడు వాసన రావడం మొదలవుతుంది. అలా ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకొనే ప్రయత్నంలో రామనాధం పుట్టుక గురించి బలమైన విషయాలు తెలుసుకొంటారు వారి పిల్లలు. ఏమిటా విషయం? ఆయనకు వచ్చే చెడు వాసనకు, ఆయన కుమార్తె ప్రసవానికి సంబంధం ఏమిటి?

స్పర్శ: పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొని.. అనంతరం ప్రేమించుకుంటూ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటారు శేఖర్ (వికాస్) & దేవి (దివ్య శ్రీపాద). ఆమెకు ఎనిమిదో నెలలో క్యాన్సర్ ఉందని తెలుసుకొంటారు. రోగిస్టి భార్యకి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకోమని శేఖర్ తండ్రి, కడుపులో బిడ్డను తీసేస్తే బ్రతుకుతావని దేవి తల్లి లేనిపోని మాటలు చెప్పి ఎంతగా వేధించినా.. బిడ్డకు జన్మనివ్వాలని డిసైడ్ అవుతారు శేఖర్ దేవీల జంట. వారి నిర్ణయం ఎలాంటి ఫలితానికి దారి తీసింది అనేది “స్పర్శ” బ్యాక్ డ్రాప్.

వినికిడి: మనం రోజూ వినే కథలు, మాటలు మనిషిలో ఎంత పాజిటివిటీ నింపుతాయి అనేది ఈ ఎపిసోడ్ మూల కథ. లియా అనే క్యారెక్టర్ తో లైవ్ లో వాయిస్ స్టోరీస్ చెబుతుంటుంది రోషిణి (స్వాతి రెడ్డి). ఆమెను రూప (ప్రాణ్య రావు) ఎలా కదిలించింది అనేది “వినికిడి” కథాంశం.

నటీనటుల పనితీరు: ఎంత మంది యంగ్ & టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నా.. బ్రహ్మానందం తనకు లభించిన చాలా తక్కువ స్పేస్ లో అద్భుతమైన స్క్రీన్ ప్రెజన్స్ అందర్నీ డామినేట్ చేసేశారు. స్వాతి రెడ్డి కాస్త పర్వాలేదనిపించుకుంది. శివాత్మిక క్యూట్ గా, రాహుల్ మార్ట్ గా అలరించారు. సముద్రఖని నటనతో ఆకట్టుకున్నారు. దివ్య శ్రీపాద తన ప్రామిసింగ్ నటనతో పాత్రకు జీవం పోసింది. నరేష్ అగస్త్య, ఉత్తేజ్ ఎమోషన్ కు మించిన నటనతో ఎలివేట్ అవ్వలేకపోయారు.


సాంకేతికవర్గం పనితీరు: ఈ సినిమాకి ప్రధానాకర్షణ బ్రహ్మానందం అయితే.. ప్రత్యేక ఆకర్షణ ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం & నేపధ్య సంగీతం. సన్నివేశంలోని ఎమోషన్ ఆకట్టుకునే స్థాయిలో లేకపోయినా సరే.. తన సంగీతంతో ప్రేక్షకుడ్ని సినిమాలో లీనమయ్యేలా చేయడానికి విశ్వప్రయత్నం చేశాడు. రాజ్ నల్లి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. డీసెంట్ వర్క్ & ఫ్రేమింగ్స్ తో పర్వాలేదనిపించుకున్నాడు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యంలో తెలుగు ఊపిరి పీల్చుకుంది. గ్యారీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఇంకాస్త కఠినంగా ఉంటే బాగుండు అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ డిపార్ట్మెంట్స్ తమ పనితనంతో సినిమాకి వేల్యూ యాడ్ చేశారు.

దర్శకుడు హర్ష పులిపాక చెప్పాలనుకున్న కథలు బాగున్నా.. ఎలివేట్ అవ్వాల్సిన ఎమోషన్స్ లోపించడంతో సినిమా చాలా సాధారణంగా ముగిసిపోయింది. ముఖ్యంగా ఫస్ట్ ఎపిసోడ్ సినిమాకి మెయిన్ మైనస్ గా నిలిచింది. అక్కడ పాత్ర ఎందుకంత ఆనందాన్ని పొందుతున్నాడో అర్ధం కాక, అక్కడ అంత ఎమోషన్ ఏముందో తెలియక ప్రేక్షకుడు నిరాశ చెందుతాడు. రెండో కథ సింపుల్ గా, మూడో కథ మాత్రం పక్కాగా ఉన్నాయి.

నాలుగో కథలో ఎమోషన్ బాగున్నా.. అమ్మ ప్రేమను ఇంకా బాగా ఎలివేట్ చేసే అవకాశాన్ని వినియోగించుకోలేదు. అయిదో కథ మాత్రం హృద్యంగా రాసుకొన్నాడు. అందువల్ల చాలా పేలవంగా మొదలైన పంచతంత్ర కథలు.. బలంగా ముగిశాయి. ఓవరాల్ గా.. దర్శకుడు హర్ష పులిపాక తన పనితనంతో మెప్పించాడనే చెప్పాలి.

విశ్లేషణ: అయిదు కథలను, ఒక సినిమాగా తెరకెక్కించడం అనేది కష్టమైన పనే. ఆ కష్టం తెరపై కనిపించకూడదు. పాత్రలు, వాటి ఎమోషన్స్ మాత్రమే కనెక్ట్ అవ్వాల్సిన సందర్భంలో.. కథలో సరైన ఎమోషన్ లేక సినిమా నుంచి ఆడియన్స్ డిస్కనెక్ట్ అవ్వడం అనేది మేజర్ మైనస్ గా చెప్పాలి. ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే “పంచతంత్రం” మరో కేరాఫ్ కంచర్లపాలెం అయ్యేది.

రేటింగ్: 2/5 

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus