మనీ లాండారికి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి కొన్ని విషయాలు బయటకొచ్చాయి. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో వ్యాపారి సుఖేష్ చంద్రశేఖర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. సుఖేష్ నుంచి నటి జాక్వెలిన్ భారీ గిఫ్ట్ లు అందుకున్నట్లు విచారణలో తెలిసింది. దీంతో అధికారులు ఆమెకి కూడా నోటీసులు జారీ చేసి.. విచారిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఆమెని విచారించారు. సుఖేష్ తో జాక్వెలిన్ రిలేషన్ కొనసాగించిందని విచారణలో తెలిసింది.
ఒకానొక సమయంలో జాక్వెలిన్ అతడిని పెళ్లి కూడా చేసుకోవాలనుకుందట. తన డ్రీమ్ బాయ్ దొరికాడని.. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. సుఖేష్ ను ఉద్దేశిస్తూ జాక్వెలిన్ తన స్నేహితులతో చెప్పిందట. ఆమెను మరింత దగ్గర చేసుకోవడానికి సుఖేష్ రూ.10 కోట్ల విలువ చేసే గిఫ్ట్స్ ఇచ్చాడు. వీటిలో డైమండ్స్, మినీకూపర్ కార్, కాస్ట్లీ బ్యాగ్స్ ఇలా చాలానే ఉన్నాయి. సుఖేష్ మోసాలకు సంబంధించిన ఓ వార్తను చూసి జాక్వెలిన్ షాక్ అయినట్లు ఆమె స్నేహితులు తెలిపారు.
సుఖేష్ ను తనకు పరిచయం చేసిన పింకీ ఇరానీని ఈ విషయంపై ప్రశ్నించగా.. ఆమె కవర్ చేసే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది. సుఖేష్ కి జాక్వెలిన్ ని పరిచయం చేయడానికి పింకీ ఇరానీ డబ్బు తీసుకుందని టాక్. అయితే సుఖేష్ ఆర్థిక నేరగాడనే విషయం జాక్వెలిన్ కి ముందే తెలుసని అంటున్నారు అధికారులు.
తెలిసే అతడితో రిలేషన్ మెయింటైన్ చేసిందని.. అంటున్నారు. సుఖేష్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో.. వెంటనే జాక్వెలిన్ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిందని చెబుతున్నారు. జాక్వెలిన్ కి చెందిన ఆస్తులను ఈడీ సీజ్ చేసిన సంగతి తెలిసిందే!
Most Recommended Video
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!