‘బిగ్ బాస్ 6’ స్టార్ట్ అయ్యి రెండు వారాలు పూర్తి కానుంది. మొదటి వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు కాబట్టి..కొంతమంది పై నెగిటివిటీ ఏర్పడినా ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నారు. ఈ లిస్ట్ లో గీతు రాయల్ కూడా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ‘బిగ్ బాస్ 6’ లోకి 8వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది గీతు రాయల్. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూనే తనకు గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి, తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనే దాని గురించి ఎవి ద్వారా చెప్పి కంటతడి పెట్టించింది. అలాగే స్టేజ్ పై తన భర్తని కూడా పరిచయం చేసింది. బిగ్ బాస్ షో పై రివ్యూస్ చేస్తూ యూట్యూబ్ లో పాపులర్ అయిన గీతు రాయల్ ఏకంగా హౌస్ లోకే ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈమె గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) గీతు రాయల్ 1997వ సంవత్సరం ఆగస్టు 27న జన్మించింది. పుట్టి పెరిగింది కూడా చిత్తూర్ లోనే..! ఈమె అసలు పేరు గ్రీష్మ లేఖ అని అంతా అంటుంటారు.
2) గీతు ఫ్యామిలీ ఫైనాన్సియల్ గా బాగా సెటిల్ అయిన ఫ్యామిలీనే..! కాకపోతే ఈమె తండ్రి శేఖర్ చేసిన బిజినెస్ లో భారీగా నష్టాలు రావడంతో వీళ్ళ ఫ్యామిలీకి కష్టాలు వచ్చి పడ్డాయి. వీళ్లకు రోజు గడవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటికి గీతు వయసు 4 ఏళ్లు
3) అయితే ఈమె తల్లి సుధా రాజ్యం కుటుంబ బాధ్యతల్ని స్వీకరించింది. గీతు మరియు అతని సోదరుడు హర్ష తేజ చదువుల కోసం ఈమె బాగా కష్టపడింది.
4) సుధా రాజ్యంకి నంద్యాలలో జాబ్ దొరకడంతో గీతు ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అయ్యింది.
5) స్కూలింగ్ పూర్తయ్యాక గీతు.. నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చేసింది. అటు తర్వాత బెంగళూరు లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది.
6) చదువు పూర్తయ్యాక గీతు కొన్నేళ్లు అమెజాన్ లో వర్క్ చేసేది.
7) తర్వాత ఈమె మోటివేషనల్ వీడియోలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ గా మారింది.
8) అటు తర్వాత బిగ్ బాస్ వీడియోలకు రివ్యూలు చెబుతూ బాగా పాపులర్ అయ్యింది. ‘గలాటా గీతు రాయల్’ గా ఈమె బాగా ఫేమస్ అయ్యింది. ఆర్జేగా కూడా పనిచేసింది.
9) ‘జబర్దస్త్’ లో కూడా గీతు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ‘బిగ్ బాస్6’ స్టేజి పై ఈమె తన భర్తని కూడా పరిచయం చేసింది. తన భర్త పేరు వికాస్.
10) గీతు రాయల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఈమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనాలి. మరి బిగ్ బాస్ లో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.