Janhvi Kapoor: శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్…బ్యూటిఫుల్ పిక్స్ వైరల్!

దివంగత పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ధడక్‌’ చిత్రంతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె… మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అందానికి కూడా యూత్ మంచి మార్కులు వేశారు. అయితే రెండో చిత్రం ‘గుంజన్ సక్సేనా’ ‘ గుడ్ లక్ జర్రీ ‘ వంటి సినిమాలు ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.

మరోపక్క జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కి కూడా బోనీకపూర్ పెద్ద స్కెచ్ లు వేస్తున్నాడు. బాలీవుడ్ డెబ్యూ విషయంలో జరిగిన తప్పు, టాలీవుడ్ డెబ్యూ విషయంలో జరగకూడదు అని భావిస్తున్నాడు. అందుకే లైగర్ సినిమాలో అవకాశం వచ్చినా.. ఆ ఆఫర్ కు నొ చెప్పాడు. త్రివిక్రమ్ – బోని కపూర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు… ఆ మూవీతో జాన్వీ ని లాంచ్ చేయాలి అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది.

కానీ జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం బోని కపూర్ చాలా పంచాయితీలు పెడుతున్నాడు అన్నది నిజం. మరోపక్క జాన్వీ హాట్ హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఇప్పటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలి అంటే కచ్చితంగా గ్లామర్ షో ముఖ్యం అని ఆమె భావిస్తుంది. అయితే ఈమెకు ఎక్కువగా బ్లాక్ డ్రెస్ అంటే ఇష్టమనుకుంట. ఎక్కువగా ఆ డ్రెస్లోనే ఫోటో షూట్లు చేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.మీరు కూడా ఓ లుక్కేయండి:

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus