HIT 2 Review: హిట్2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 2, 2022 / 01:32 PM IST

Cast & Crew

  • అడివిశేష్‌ (Hero)
  • మీనాక్షి చౌదరి (Heroine)
  • రావు రమేష్‌, భాను చందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు (Cast)
  • శైలేష్‌ కొలను (Director)
  • ప్రశాంతి త్రిపిర్‌నేని (Producer)
  • జాన్‌ స్టీవర్స్‌ ఎడురి (Music)
  • మణికందన్‌.ఎస్ (Cinematography)

“హిట్”తో కరోనా ప్రపంచాన్ని కబళించడానికి ముందు లాస్ట్ హిట్ కొట్టిన శైలేష్ కొలను.. ఇప్పుడు రెండో పార్ట్ తో “హిట్ 2” అంటూ మన ముందుకు వచ్చాడు. తొలి భాగంలో విశ్వక్సేన్ హీరో కాగా.. రెండో పార్ట్ లో అడివి శేష్ హీరో. మరి మొదటి భాగంతో మెప్పించిన శైలేష్.. రెండో భాగంతో సక్సెస్ అందుకోగలిగాడో లేదో చూద్దాం..!!

కథ: వైజాగ్ లో జాలీ పోలీస్ గా పేరున్న ఎస్.పి కృష్ణ దేవ్ (అడివి శేష్). అప్పటివరకూ సాఫీగా సాగిపోతున్న కె.డి లైఫ్ ని ఓ మర్డర్ కేస్ డిస్టర్బ్ చేస్తుంది. సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం కోసం కె.డి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు కానీ వర్కవుటవ్వదు. ఒకానొక సందర్భంలో కిల్లర్ ను పట్టుకున్నాను అని ధీమాగా ఉన్న కె.డి కాన్ఫిడెన్స్ ను కిల్లర్ ఒక్క ట్విస్ట్ తో చెడగొట్టేస్తాడు. అప్పట్నుంచి మెంటల్ గా డిస్టర్బ్ అయిన కె.డి ఈ సీరియల్ కిల్లర్ ను ఎలా పట్టుకున్నాడు? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? అతడు ఎందుకని అమ్మాయిలను దారుణంగా హత్య చేస్తుంటాడు? అనేది “హిట్ 2” కథాంశం.

నటీనటుల పనితీరు: అడివి శేష్ కు ఈ తరహా పాత్రలు నల్లేరుపై నడక లాంటిది. చాలా ఈజ్ తో కృష్ణ దేవ్ అలియాస్ కె.డిగా జీవించేశాడు. బాడీ లాంగ్వేజ్ & మ్యానరిజమ్స్ విషయంలో శేష్ తీసుకొనే ప్రత్యేక శ్రద్ధ క్యారెక్టర్ ఎలివేషన్ & రిలేటబిలిటీకి బాగా ఉపయోగపడుతుంది.

మీనాక్షీ కేవలం అందాల ప్రదర్శనకు లేదా హీరోతో రొమాన్స్ కు పరిమితమవ్వకుండా నటిగానూ తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆమె నటనకు మంచి అప్లాజ్ వస్తుంది.

మాగంటి శ్రీనాథ్ క్యారెక్టర్ ను మొదటి పార్ట్ నుంచి రెండో పార్ట్ కు కంటిన్యూ చేసిన తీరు బాగుంది. రావు రమేష్ నటన బాగున్నా.. మొదటి పార్ట్ లో మెప్పించిన భానుచందర్ స్క్రీన్ ప్రెజన్స్ ను మాత్రం బీట్ చేయలేకపోయాడు.

సాంకేతికవర్గం పనితీరు: జాన్ స్టీవార్ట్ నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం. ట్విస్ట్స్ & ఎలివేషన్స్ ను తన నేపధ్య సంగీతంతో భలే ఎంగేజింగ్ గా ఎలివేట్ చేశాడు జాన్. సినిమా సక్సెస్ లో సింహ భాగం జాన్ దే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎస్.మణికందన్ ఈసార్ ఫ్రేమ్స్ తో కాక టింట్ తో ఆడియన్స్ ను సినిమాలో ఎంగేజ్ చేయడానికి ప్రత్యత్నించిన విధానం బాగుంది. ముఖ్యంగా నైట్ షాట్స్ లో లైటింగ్ ను వినియోగించుకున్న తీరు కూడా బాగుంది. అందువల్ల ఆడియన్స్ కి మంచి థ్రిల్లింగ్ మూడ్ క్రియేట్ అవుతుంది.

దర్శకుడు శైలేష్ థ్రిల్లర్ జోనర్ లో తాను ఎంత స్ట్రాంగ్ అనేది మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కథను మొదలుపెట్టిన విధానం, కథనాన్ని నడిపించిన తీరు అద్భుతంగా ఉంటాయి. అయితే.. సెకండాఫ్ లో కాస్త తడబడ్డాడు, అలాగే.. క్లైమాక్స్ జస్టిఫికేషన్ సరిగా ఇవ్వలేకపోయాడు. అయితే.. ఆ వెలితిని పార్ట్ 3 ఎనౌన్స్ మెంట్ తో కవర్ చేశాడు.

ఇవన్నీ పక్కన పెడితే.. ఒక థ్రిల్లర్ ను ఎంత ఆసక్తికరంగా నడిపించొచ్చు, ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు అనే విషయంలో ఒక కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేశాడు శైలేష్ కొలను. క్రిస్ప్ రన్ టైమ్ అనేది ఒక సినిమాకి ఎంత కీలకమో, నేపధ్య సంగీతంతో ఒక సాధారణ సినిమాని ఎలా ఎలివేట్ చేయొచ్చు వంటి విషయాలను నవతరం దర్శకులకు ఒక ప్రొజెక్ట్ రిపోర్ట్ లా “హిట్” యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్నాడు శైలేష్. అలాగే.. పార్ట్ 3 కూడా ఉందని కన్ఫర్మ్ చేయడం అనేది ఈ సిరీస్ కి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

విశ్లేషణ: చిన్నపాటి మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ.. శైలేష్ సినిమాని నడిపించిన విధానం, అడివి శేష్ నటన, జాన్ నేపధ్య సంగీతం కోసం “హిట్ 2″ను ఒకసారి కచ్చితంగా చూడొచ్చు. ముఖ్యంగా థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ సినిమాను విశేషంగా ఎంజాయ్ చేస్తారు.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus