Matti Kusthi Review: మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • విష్ణు విశాల్ (Hero)
  • ఐశ్వర్యలక్ష్మి (Heroine)
  • గజరాజ్, కరుణాస్, శ్రీజ రవి, మునిష్కాంత్, కాళీ వెంకట్, హరీష్ పేరడి, అజయ్, శత్రు (Cast)
  • చెల్లా అయ్యావు (Director)
  • రవితేజ, విష్ణు విశాల్ (Producer)
  • జస్టిన్ ప్రభాకరన్ (Music)
  • ఎస్.మణికందన్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 02, 2022

తమిళ నటుడు విష్ణు విశాల్, మలయాళీ భామ ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం “మట్టి కుస్తీ”. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాద రూపంలో విడుదల చేశారు. ఈ చిత్ర నిర్మాతల్లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు కావడం విశేషం. టైటిల్ తో ఏమాత్రం సంబంధం లేని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: ఓ పల్లెటూరికి చెందిన యువకుడు వీర (విష్ణు విశాల్). ఎలాంటి గోల్స్ లేకుండా చాలా సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. పెళ్లి మాత్రం చదువు లేని ఓ పల్లెటూరి అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటాడు. అలా అయితేనే తన ఆటలు సాగుతాయని ఈ ప్లాన్ వేసుకుంటాడు.

కట్ చేస్తే.. డిగ్రీ కంప్లీట్ చేసిన కుస్తీ యోధురాలు కీర్తి (ఐశ్వర్య లక్ష్మి)తో పెళ్లవుతుంది. అనంతరం వీర-కీర్తిల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి. ఈ పెళ్లి పుస్తకంలో మట్టి కుస్తీ పాత్ర ఏమిటి? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: విష్ణు విశాల్ కంటే ఐశ్వర్య లక్ష్మి నటిగా ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం, కసరత్తులు కనిపిస్తాయి. విష్ణు విశాల్ చాలా రెగ్యులర్ రోల్లో పర్వాలేదనిపించుకున్నాడు. శత్రు, అజయ్ నెగిటివ్ రోల్స్ లో అలరించారు.

వీళ్ళందరికంటే ఎక్కువగా అలరించిన నటుడు హరీష్ పేరాడి. కుస్తీ కోచ్ గా సీరియస్ రోల్లో అలరించాడు. అలాగే “డాక్టర్” ఫేమ్ రెడ్ కింగ్స్లే కామెడీ టైమింగ్ చక్కగా నవ్విస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు: జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, రిచర్డ్ సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉండగా.. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ మాత్రం సినిమాకి తగ్గట్లుగా ఉంది. దర్శకుడు చెల్ల ఎంచుకున్న కథ, ఆ కథను నడిపించిన విధానం బాగున్నాయి. ఒక ఫ్యామిలీ డ్రామాలో స్పోర్ట్స్ యాంగిల్ ను ఇంక్లూడ్ చేసి చాలా హుందాగా కథను నడిపించిన విధానం ప్రశంసనీయం.

ప్రస్తుత తరం భార్యాభర్తలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకని ఇంటికే పరిమితమవ్వాలి?, సొంత ఇల్లు వదిలి భర్తతో కొత్త ఇంటికి వచ్చిన యువతి మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయి? వంటి విషయాలను చాలా సింపుల్ హ్యూమర్ తో వివరంగా చెప్పిన విధానం బాగుంది. దర్శకుడిగా చెల్ల అయ్యవు మంచి విజయాన్ని అందుకున్నాడని చెప్పొచ్చు.

విశ్లేషణ: టైటిల్ చూసి ఏదో స్పోర్ట్స్ డ్రామా అనుకుంటాం కానీ.. “మట్టి కుస్తీ” ఓ మంచి ఫ్యామిలీ డ్రామా సినిమా. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఈ చిత్రం విష్ణు విశాల్ కు హిట్ ఇచ్చిందనే చెప్పాలి.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus