నిన్న ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) టీం టాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. కమల్ హాసన్, శంకర్ లతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన సిద్దార్థ్ (Siddharth) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) , బాబీ సింహా (Bobby Simha) వంటి వారు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే శంకర్ (Shankar) , కమల్ హాసన్ (Kamal Haasan) వంటి లెజెండ్స్ ఉండగా సిద్దార్థ్, రకుల్, బాబీ సింహా వంటి వారిపై కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే రిపోర్టర్లంతా వాళ్లనే ఫోకస్ చేసి ప్రశ్నలు అడిగారు. రకుల్, బాబీ సింహా ఇది అర్థం చేసుకుని సైలెంట్ గా ఉండిపోయారు.
కానీ సిద్దార్థ్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. కమల్, శంకర్..లని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మధ్యలో దూరిపోయి ఏంటేంటో మాట్లాడేశాడు. అంతేకాకుండా మీడియా వాళ్ళ పై సెటైర్లు కూడా విసిరాడు. అసలే తనని ఒక ప్రశ్న అడిగితే 20 నిమిషాల పాటు నాన్ సింక్ లో సమాధానం ఇచ్చే రకం సిద్దార్థ్. ఈ ప్రెస్ మీట్ లో కూడా అలాగే వ్యవహరించాడు. మరోవైపు గతంలో సిద్దార్థ్ ని సీనియర్ నటి జయసుధ (Jayasudha) ‘ఈ అబ్బాయిని చూస్తుంటే అప్పట్లో కమల్ గుర్తుకొస్తున్నాడు’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందట.
సందర్భం లేకపోయినా కేవలం కమల్ హాసన్ పక్కన ఉన్నాడు కదా అని మధ్యలో దూరిపోయి ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు సిద్దార్థ్. కమల్ హాసన్ అంత గొప్ప నటుడైతే సిద్దార్థ్ కాదు. మరి జయసుధ మాటలకి అర్థం ఏంటి? ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట పలికిందో తెలీదు. ‘బహుశా కమల్ లోని ఇంకో యాంగిల్ ను గమనిస్తే.. ఆయన స్త్రీలోలుడు అంటూ ఉంటారు.
కమల్ నడిపిన రాసలీలలు అన్నీ ఇన్నీ కాదు. సిద్దార్థ్ కూడా ఆ విషయంలో ఏమాత్రం తీసిపోడు. అతను కూడా చాలా మంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపాడు. బహుశా పులిహోర కలిపే విషయంలో సిద్దార్థ్ ని గమనించిన జయసుధ..ఈ మాట పలికి ఉండొచ్చు’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.