Hema: మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

హేమ (Hema) బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బుక్కైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని ఆమె ఇప్పటికీ అంగీకరించకుండా బుకాయిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఆ విషయాన్ని పక్కదోవ పట్టించడానికి ఆమె వేరే పనులు పెట్టుకోవడం వంటివి కూడా అందరికీ తెలుసు. అయితే ఆమె రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె మా సభ్యత్వాన్ని తొలగించి బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు.. అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే మొదట ఈ విషయాన్ని హేమ ఎందుకో పట్టించుకోలేదు. బహుశా బెంగళూరులో విచారణలకి హాజరవుతూ బిజీగా ఉండటం వల్లో ఏమో కావచ్చు. కానీ ఇప్పుడు తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేస్తారు అంటూ ఆమె ప్రశ్నిస్తుంది. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు మంచు విష్ణుని కలిసి ఓ ఎమోషనల్ లెటర్ ని అందజేసింది. ‘నన్ను మా సభ్యత్వం నుండి తొలగించడం అన్యాయం, షోకాజు నోటీసు ఇవ్వకుండా, నా వివరణ కోరకుండా సభ్యత్వం నుండి ఎలా తొలగిస్తారు? మళ్ళీ నా సభ్యత్వాన్ని పునరుద్దరించాలని’ కోరుతూ ఆమె లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది.

ఈ లేఖతో పాటు హేమ డ్రగ్స్ తీసుకుందా లేదా అని ధృవీకరించే టెస్ట్ రిపోర్ట్ ను కూడా మంచు విష్ణుకు ఆమె అందజేసినట్టు సమాచారం. మరి ఈ విషయం పై మా అధ్యుక్షుడు అలాగే మిగిలిన మెంబర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus