బిగ్ బాస్ సీజన్ 8 అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ ను కూడా నాగార్జునే (Nagarjuna) హోస్ట్ చేయనున్నారు. ఇక కంటెస్టెంట్ల గురించి రోజుకో వార్త ప్రచారమవుతుంది. మొదట్లో వేణు స్వామి, రాజ్ తరుణ్ (Raj Tarun) వంటి వారు ఈ సీజన్లో పాల్గొంటారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేశాయి. కానీ అందులో ‘ఎలాంటి నిజం లేదు’ అని ఒక్కొక్కరుగా క్లారిటీ ఇస్తున్నారు. ఆల్రెడీ రాజ్ తరుణ్ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక వేణు స్వామిని అయితే బిగ్ బాస్ టీం వద్దన్నట్టు వినికిడి. తాజాగా జ్యోతి రాయ్ (Jyothi Rai) కూడా ‘బిగ్ బాస్’ గురించి క్లారిటీ ఇచ్చింది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో హీరో తల్లి పాత్రలో నటించి మెప్పించిన ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తుంటుంది. దర్శకుడు సుక్కు పూర్వాజ్ ను ఈమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ‘ఏ మాస్టర్ పీస్’ అనే సినిమాలో ఈమె నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘బిగ్ బాస్’ గురించి కూడా ఈమె స్పందించింది. ‘నేను బిగ్ బాస్ కు వెళ్తున్నాను అనే వార్తల్లో నిజం లేదు. ఈ వార్త ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కావడం లేదు.నాకు సంబంధించిన ఏ వార్త అయినా సరే స్వయంగా నేనే ప్రకటిస్తాను. ఇలాంటి గాసిప్స్ నమ్మొద్దు. నా తల్లిదండ్రులు నా సోదరుడితో ఉంటారు. వాళ్లు ఏ మీడియాతో మాట్లాడలేదు. కన్నడ బిగ్ బాస్ నుండి మాత్రం ఆఫర్ వచ్చింది. కానీ నేను దానికి నో చెప్పాను” అంటూ క్లారిటీ ఇచ్చింది జ్యోతి రాయ్ (Jyothi Rai) .