Jyothi Ray: డైరెక్టర్ ను పెళ్లి చేసుకున్న బుల్లితెర నటి జ్యోతి రాయ్ అలా బయట పెట్టేసిందిగా?

జ్యోతి రాయ్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ జగతి అంటే మాత్రం అందరూ ఆమెను గుర్తుపడతారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె జగతి పాత్రలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.అయితే జగతి పాత్రలో నటిస్తున్నటువంటి జ్యోతి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నటిస్తున్నారు. అందుకు గల కారణం ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు కారణమని చెప్పాలి.

చీర కట్టులో ఎంతో పద్ధతిగా కనిపించే ఈమె సోషల్ మీడియాలో మాత్రం భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసిన వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈమె గురించి మరికొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈమెకు 20 సంవత్సరాల వయసులోనే వివాహం జరిగిందని అంతేకాకుండా ఈమెకు ఓ కుమారుడు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే విడాకులు ఇచ్చి ఒక కుర్ర డైరెక్టర్ తో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి.

ఇలా ఆ డైరెక్టర్ తో కలిసి జ్యోతి (Jyothi Ray) తీసుకున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారేమోనని సందేహాలు వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈమె ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. ట్విట్టర్ అకౌంట్ లో ఈమె పేరు చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈమె జ్యోతి పూర్వాజ్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు. దీంతో ఈమె డైరెక్టర్ సుఖ పూర్వజ్ ను పెళ్లి చేసుకున్నారా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసినటువంటి ఈమె ఇలా జ్యోతి పూర్వాజ్ అనే పేరు పై ఓపెన్ చేయడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని ఈ విషయాన్ని ఈమె ఇలా హింట్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా ఈమె అకౌంట్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా నటిస్తూ కనిపించే ఈమె వ్యక్తిగత జీవితంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus