Kasturi: కస్తూరి వ్యాఖ్యలకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన రెహమాన్!

ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ గత రెండు రోజుల క్రితం చెన్నైలోని ఒక అవార్డు వేడుకలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి ఈయన తన భార్యని తీసుకొని వచ్చారు. ఇక ఈ వేదికపై రెహమాన్ భార్య సైరా భానునీ మాట్లాడవలసిందిగా కోరారు. అయితే ఆమె స్టేజ్ పైకి వెళ్తున్న సమయంలో ఏఆర్ రెహమాన్ తనని తమిళంలో మాట్లాడమని చెప్పారు. ఇక ఆమె తనకు తమిళం సరిగ్గా రాదని చెబుతూ ఇంగ్లీష్ లో మాట్లాడారు.

ఇలా సైరా బాను తమిళ అమ్మాయి అయినప్పటికీ తనకు తమిళం రాదంటూ ఇంగ్లీషులో మాట్లాడటంతో ఇది కాస్త వైరల్ గా మారింది.దీంతో నటి కస్తూరి శంకర్ సైరా బాను వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విమర్శలు కురిపించారు. ఏఆర్ రెహమాన్ భార్య సైరా భానుకి తమిళం మాట్లాడటం రాదా? మీ మాతృభాష ఏది? మీ కుటుంబంలో మీరంతా ఏ భాషలో మాట్లాడుతారు? అంటూ ప్రశ్నలు వేశారు.

ఇలా (Kasturi) కస్తూరి శంకర్ సైరాబాను పట్ల ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ విమర్శలు చేయడంతో ఈ వ్యాఖ్యలపై సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు.ఈ సందర్భంగా రెహమాన్ కస్తూరి మాటలకు రిప్లై ఇస్తూ ప్రేమకు భాష లేదు అంటూ సమాధానం చెప్పారు. ఇలా రెహమాన్ ఈ విధమైనటువంటి సమాధానం చెప్పడంతో ఈ వివాదానికి ఇంతటితో పులిస్టాప్ పడిందని భావిస్తున్నారు. రెహమాన్ హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడమని చెప్పడంతో తనపై కూడా విమర్శలు వెల్లువెతాయి.

రెహమాన్ హిందీ సినిమాలు చేయవచ్చు హిందీ పాటలు పాడవచ్చు కానీ తన భార్య హిందీలో మాత్రం మాట్లాడకూడదు ఎందుకు ఈ భాషా బేధం అంటూ పెద్ద ఎత్తున ఈయనపై కూడా కామెంట్లు చేశారు.ఇక కస్తూరి శంకర్ విషయానికి వస్తే నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ద్వారా కస్తూరి శంకర్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus