Kavya Kalyan Ram: చైతన్యతో ఆ అవకాశం వస్తే అసలు వదులుకోను: కావ్య కళ్యాణ్ రామ్!

  • August 23, 2023 / 11:58 AM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కావ్య కళ్యాణ్ రామ్ ఒకరు. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సందడి చేసినటువంటి ఈమె మసూద సినిమాలో హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బలగం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమెకు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కావ్య కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన నాగచైతన్య గురించి కూడా పలు విషయాలను తెలియజేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య నా క్రష్ అని ఈమె తెలియజేశారు. నాగచైతన్యతో కనుక సినిమాలలో నటించే అవకాశం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా ఆ సినిమాలో నటిస్తానని ఈమె తెలియజేశారు.

నాగచైతన్య అంటే తనకు చాలా ఇష్టమని అతనితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలియజేశారు. ఇక తన వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడుతూ తన ముద్దు పేరు అమ్ము అని బీటెక్ పూర్తి చేశానని అలాగే తను డిస్టిక్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ అంటూ కూడా తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.ఇలా పర్సనల్ విషయాలతో పాటు తనకు నాగచైతన్య అంటే ఇష్టం అంటూ కావ్య (Kavya Kalyan Ram) తెలియజేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus