‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ కావ్యా థాఫర్ పై కేసు నమోదు..!

  • February 18, 2022 / 10:29 PM IST

సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది కావ్య థాపర్‌. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో నేరుగా విడుదలైన ఈ చిత్రం మంచి రిజల్ట్ నే సాధించింది. హీరోయిన్ కావ్య ఈ చిత్రం ద్వారా మంచి ఇమేజ్ నే సొంతం చేసుకుంది.ఈమె లుక్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. కానీ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అయితే అవకాశాలు రావడం లేదు. ఇదిలా ఉండగా… ముంబైలో కావ్య అరెస్ట్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.

Click Here To Watch

ఈమె ఫుల్ గా మద్యం సేవించి ఆ మత్తులో కారుని ఢీ కొట్టడమే కాకుండా.. పోలీసులని బండ మీదకు బూతులు తిట్టి వారి పై దాడికి పాల్పడింది. ఈ కారణంతో ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన కావ్య ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించింది. అటు తర్వాత వెండితెర పైకి ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ ఫిల్మ్ ‘తక్తల్‌’ తో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది.

తర్వాత 2018లో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. అయితే ‘ఏక్ మినీ కథ’ చిత్రమే ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఇప్పుడు కావ్య అరెస్ట్ మేటర్ వైరల్ అవుతుంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus