10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. మనం చూసే సినిమాల్లో హీరోయిజం అంతా దర్శకుల ఆటిట్యూడ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఓ దర్శకుడు క్లాస్ గా సినిమా తీస్తాడు. ఇంకో దర్శకుడు మాస్ గా సినిమా తీస్తాడు. ఇంకో దర్శకుడు కామెడీతో సినిమా తీస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కథ ఉంటుంది. అయితే ప్రస్తుతం దర్శకులంతా ఒకప్పుడు వేరే దర్శకులతో పనిచేసిన వాళ్ళు అయ్యి ఉంటారు. లేదంటే కొంతమంది దర్శకుల స్పూర్తితో కథలు రాసుకుని సినిమాలు తీస్తుంటారు. అందరి గురించి ఏమో కానీ కొంత మంది దర్శకులను 1980- 90,2000 సంవత్సరాల్లో రాణించిన దర్శకులతో పోలిస్తే ఎలా ఉంటుంది.? విడ్డూరంగా ఉన్నా బాగానే ఉంటుందేమో. ఓ లుక్కేద్దాం రండి :

1) రాజమౌళి – కె.రాఘవేంద్ర రావు

క్లాస్ సినిమాలు, మాస్ సినిమాలు, గ్రాఫికల్ వండర్స్ తీసే రాఘవేంద్ర రావు శిష్యుడు మన రాజమౌళి. ఈ విషయాన్ని ఎప్పుడో ప్రూవ్ చేశారు.

2) గుణ శేఖర్ – కోడి రామకృష్ణ

కోడి రామకృష్ణ గారి సినిమాల్లో కనిపించే గ్రాండియర్ అంతా గుణ శేఖర్ గారి సినిమాల్లో కూడా కనిపిస్తుంటాయి.

3) శ్రీను వైట్ల – ఎస్వీ కృష్ణా రెడ్డి

అప్పటి జెనరేషన్లో ఎస్వీ కృష్ణా రెడ్డి గారు మొన్నటి వరకు శ్రీను వైట్ల గారు కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసారు.

4) సందీప్ రెడ్డి వంగా – రాంగోపాల్ వర్మ

అర్జున్ రెడ్డి వంటి గేమ్ ఛేంజర్ మూవీని అందించిన సందీప్ రెడ్డి వంగా, ‘శివ’ వంటి గేమ్ ఛేంజర్ మూవీని అందించిన రాంగోపాల్ వర్మ.. ఆటిట్యూడ్ విషయంలో సేమ్ టు సేమ్.

5) పూరి జగన్నాథ్ – దాసరి నారాయణ రావు

దాసరి గారే ఓ సందర్భంలో చెప్పారు… పూరి నా వారసుడు అని..!

6) సురేందర్ రెడ్డి – బి.గోపాల్

మాస్ సినిమాలు తీయడంలో ఈ ఇద్దరిది ప్రత్యేక శైలి.

7) త్రివిక్రమ్ శ్రీనివాస్ – జంధ్యాల

చాలా సందర్భాల్లో అందరూ చెప్పుకునేదే ఇది. ఇద్దరూ హెల్ధీ కామెడీని అందించే బ్యాచే..!

8) వి.వి.వినాయక్ – కోదండ రామిరెడ్డి

మాస్ క బాప్.. బాక్సాఫీస్ షేక్.. ఈ పదాలు చెప్పుకోవాలంటే ఈ దర్శకులే..! ఇద్దరూ మాస్ కు ఫుల్ ఫీస్ట్ ఇచ్చే మూవీస్ అందించారు.

9) శేఖర్ కమ్ముల – బాపు

సినిమాలని ఓ చందమామ కథల్లా చూపించాలంటే ఈ దర్శకులే..!

10) కృష్ణ వంశీ – మణిరత్నం

క్రియేటివిటీ, సహజత్వం… మంచి పాటలు, అద్భుతమైన లొకేషన్లు… టెక్నికల్ టీం ను వందకి వంద శాతం వాడుకునే దర్శకులు వీళ్ళు..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus