Keerthy Suresh: పీచ్‌ పింక్‌ కలర్‌ డ్రెస్‌లో ఫోటోలకు పోజులిచ్చిన కీర్తిసురేష్. ముద్దుగుమ్మ ఫోటోలకు నెటిజన్లు ఫిదా

  • May 30, 2023 / 07:00 PM IST

ఈ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రభావం బాగా ఎక్కువైపోయింది. నిజమా కాదా అని తెలిసేలోపే ఏది పడితే అది రాసిపారేస్తున్నారు. ఇక ముఖ్యంగా హీరోయిన్ల ఎఫైర్స్, లవ్, మ్యారేజ్‌పై అయితే చెప్పక్కర్లేదు. వాళ్లే ఇలాంటి పుకార్లు సృష్టించేస్తున్నారు కూడా. తాజాగా హీరోయిన్ కీర్తి సురేశ్‌పై కూడా ఈ మధ్య కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కీర్తి సురేశ్.. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఫర్హాన్ బిన్ లియాఖత్‌తో డేటింగ్ చేస్తుందంటూ పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కీర్తి సురేష్‌ (Keerthy Suresh) ప్రేమలో పడిందంటూ గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం కొద్దిరోజుల క్రితం కీర్తి సురేష్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ వ్యక్తితో ఉ‍న్న ఫొటోలు షేర్‌ చేసింది. దీంతో అతడే కీర్తి సురేష్‌కు కాబోయేవాడు అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ వార్తల్లో వాస్తవం లేదని కీర్తి సురేష్‌ స్పష్టం చేశారు. ఇక తాజాగా ఇదే విషయంలో కీర్తి సురేష్ తండ్రి కూడా స్పందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రీసెంట్‌గా మహానటి పెళ్లి వార్తలపై కూడా పుకార్లు షికార్లు చేయడంతో నిజంగా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా రెడీ అయింది. కీర్తి సురేష్ షేర్ చేసిన పిక్స్‌లో నిజంగా పెళ్లి పెళ్లికూతురులా ముస్తాబైంది. అయితే పీచ్‌ పింక్‌ కలర్‌ డ్రెస్‌లో స్లీవ్స్ లేకుండా ఎద భాగం కనిపించేలా ఫోటోలకు పోజులిచ్చింది కీర్తిసురేష్. ముద్దుగుమ్మ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గంటలోనే మూడున్నర లక్షల లైక్‌లు వచ్చాయి.

కామెంట్స్ అయితే విచ్చలవిడిగా చేస్తున్నారు. నీ బుగ్గలు కొరకాలని ఉందంటూ కొందరు..ఒక సైడ్‌లో చూస్తుంటే చేపలా ఉన్నావంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో మరియు పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్ మలయాళం లో కూడా రెండు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus