Krithi Shetty: కస్టడీ సినిమాతో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన నటి!

  • May 23, 2023 / 07:29 PM IST

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం నటించిన రెండు సినిమాలు కూడా చాలా మంచి సక్సెస్ అయ్యాయి.ఇలా వరుసగా మూడు సినిమాలు సక్సెస్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి అయితే కృతి శెట్టి నటించిన తదుపరి నాలుగు సినిమాలకు కూడా వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొన్నాయి. దీంతో ఈమె కెరియర్ అయోమయంలో పడిందని అందరూ భావించారు.

తాజాగా ఈమె తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాపై చిత్ర బృందం ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా డైరెక్టర్ వెంకట్ ప్రభు తన తదుపరి ప్రాజెక్టు మాత్రం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు.

ఇక ఇదే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఈయన తెలియచేస్తూ #thalapathy68 వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రాన్ని ప్రకటించిన వెంకట్‌ ప్రభు.. ‘విజయ్‌తో సినిమా చేయాలనే నా కల నెరవేరింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమాలో కస్టడీ బ్యూటీ కృతి శెట్టికి కూడా అవకాశం కల్పించారని తెలుస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని సమాచారం.

అయితే ఇందులో ఒకరిగా వెంకట్ ప్రభు (Krithi Shetty) కృతి శెట్టిని ఎంపిక చేశారని తెలుస్తుంది. కస్టడీ సినిమా షూటింగ్ సమయంలో కృతి శెట్టి నటన నచ్చిన వెంకట్ ప్రభు ఆమెకు విజయ్ సినిమాలో కూడా హీరోయిన్గా అవకాశం కల్పించారని సమాచారం.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. ఇదే కనుక నిజమైతే నిజంగానే కృతి శెట్టి లక్కీ ఛాన్స్ కొట్టేసిందని చెప్పాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus