Bichagadu 2 Review in Telugu: బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 19, 2023 / 03:56 PM IST

Cast & Crew

  • విజయ్ ఆంటోనీ (Hero)
  • విజయ్ ఆంటోనీ (Heroine)
  • యోగిబాబు, రాధా రవి తదితరులు.. సాంకేతికవర్గం: (Cast)
  • విజయ్ ఆంటోనీ (Director)
  • ఫాతిమా విజయ్ ఆంటోనీ (Producer)
  • విజయ్ ఆంటోనీ (Music)
  • ఓం నారాయణ్ (Cinematography)
  • Release Date : మే 19, 2023

2016లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న చిత్రం “బిచ్చగాడు”. ఆ చిత్రానికి సీక్వెల్ కాకపోయినా.. ఆ తరహా మూలకథతో మన ముందుకొచ్చిన చిత్రం “బిచ్చగాడు 2”. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించడమే కాక.. దర్శకత్వం కూడా వహించిన ఈ చిత్రం ట్రైలర్ & ప్రమోషన్స్ వరకూ మంచి అంచనాలు రేకెత్తించింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!


కథ: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో 7వ వ్యక్తి విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ). అతడి ఆస్తి కోసం అరవింద్ (దేవ్ గిల్) & గ్యాంగ్ విజయ్ ని చంపేసి.. అతడి బుర్రను బిచ్చగాడైన సత్య (విజయ్ ఆంటోనీ) బుర్రతో రీప్లేస్ చేస్తారు.

అసలు ఈ మైండ్ రీప్లేస్మెంట్ కాన్సెప్ట్ వెనుక ఉన్న కథ ఏమిటి? సత్య మొదలెట్టిన యాంటీ బికిలీ అంటే ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “బిచ్చగాడు 2” కథ.

నటీనటుల పనితీరు: విజయ్ ఆంటోనీ ఎప్పట్లానే సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో సినిమా మొత్తం లాగించేశాడు. కనీసం ఎమోషనల్ & యాక్షన్ సీన్స్ లో అయినా కాస్త హావభావాలు పండించి ఉంటే బాగుండేది. కావ్య థాపర్ పాత్ర సినిమాకి చాలా కీలకంగా నిలిచింది. ఆమె పెర్ఫార్మెన్స్ తో పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. గ్లామర్ తో పర్వాలేదనిపించుకుంది. దేవ్ గిల్, రాధారవి, యోగిబాబు తదితరులు పర్వాలేదనిపించుకున్నారు.

అయితే.. ఈ చిత్రానికి దర్శకుడు, సంగీత దర్శకుడు & ఎడిటర్ కూడా విజయ్ ఆంటోనీ కావడంతో మిగతా నటీనటులెవరికీ సరైన స్క్రీన్ ప్రెజన్స్ కానీ, స్క్రీన్ టైమ్ కానీ ఇవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: కథానాయకుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఎడిటర్ విజయ్ ఆంటోనీ ప్రతి టెక్నికాలిటీకి 100% న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. సంగీత దర్శకుడిగానే ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త కఠినంగా ఉండాల్సింది. దర్శకుడిగా మొదటి 30 నిమిషాల్లో మాత్రం విశేషంగా అలరించిన విజయ్ ఆంటోనీ.. తర్వాత కథను నడిపించిన విధానం, ఇరికించిన మెసేజులు, సినిమాను ముగించిన తీరు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

అందువల్ల దర్శకుడిగా, కథకుడిగా బొటాబోటి మార్కులతో సరిపెట్టుకొన్నాడు. సినిమాటోగ్రాఫర్ ఓం నారాయణ్ తన వందశాతం ఇచ్చాడు. రెండు విభిన్నమైన ప్రపంచాలను లైటింగ్ & టోన్ తో ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది.

విశ్లేషణ: బిచ్చగాడు అనే సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కాకపోయినా.. పార్ట్ 2 (Bichagadu 2) అనగానే సినిమా మీద విశేషమైన అంచనాలు నమోదయ్యాయి. మరీ ముఖ్యంగా యాంటీ బికిలీ అనే ఒక కొత్త పదంతో చేసిన పబ్లిసిటీ బాగా వర్కవుటయ్యింది. అంచనాలు ఎక్కువవ్వడం వల్లనో, కథనంలో ఆసక్తి లోపించడం వల్లనో “బిచ్చగాడు 2” ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే.. మొదటి 30 నిమిషాలు మరియు సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు!

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus