విశాల్ పెళ్లిపై హీరోయిన్ ఇంట్రెసింగ్ కామెంట్

కోలీవుడ్ హీరో కమ్ ప్రొడ్యూసర్ విశాల్ పై చాలా రూమర్స్ వచ్చాయి. అనేక మంది హీరోయిన్స్ తో ఆయన ప్రేమాయణం నడిపారని టాక్. ముఖ్యంగా శరత్ కుమార్ కూతరు వరలక్ష్మీ తో ఆయన ప్రేమ వ్యవహారం బాగా పాప్యులర్ అయ్యింది. చాలా కాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట పెళ్ళికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్ గా బ్రేక్ అప్ చెప్పుకున్నారు. అలాగే విశాల్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ పై కూడా రూమర్స్ రావడం జరిగింది.

వరుసగా కొన్ని సినిమాలలో ఈ జంట కలిసి నటించగా వీరి మధ్య ఏదో నడుస్తుందని అప్పట్లో కోలీవుడ్ కోడై కూసింది. అలాగే విశాల్ లక్ష్మీ మీనన్ ని పెళ్లి చేసుకోనున్నారని వార్తలు రావడం జరిగింది. ఐతే గత ఏడాది విశాల్ అనిషా అనే అమ్మాయితో నిశ్చితార్ధం జరుపుకున్నారు. దీనితో విశాల్, లక్శ్మి మీనన్ పెళ్లి వార్తలకు కూడా బ్రేక్ పడినట్లు అయ్యింది. కాగా మొదటిసారి విశాల్ తో రిలేషన్ మరియు ఆయన పెళ్లిపై లక్ష్మీ మీనన్ స్పందించారు.

Actress Lakshmi Menon Opens Up About Vishal's Marriage1

నేను ఎప్పుడైనా విశాల్ తో ఛాట్ చేస్తాను. ఇక ఎవరితో పెద్దగా మాట్లాడను. విశాల్ ఒకవేళ పెళ్ళికి పిలిస్తే నేను వెళతాను. అది కూడా అప్పటి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది అని చెప్పింది. పరోక్షంగా లక్ష్మీ మీనన్ విశాల్ నాకు మంచి మిత్రుడు మాత్రమే, మా మధ్య మీరనుకుంటున్నట్లు ఏమి లేదని ఆమె హింట్ ఇవ్వడం జరిగింది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus