Madhu Bala: ఇండస్ట్రీ వదిలేయడానికి అదే కారణం.. మధుబాల కామెంట్స్ వైరల్!

  • July 7, 2023 / 09:00 PM IST

మధుబాల ఈతరం వారికి తెలియకపోయినా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తెలుగు తమిళ హిందీ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఇండస్ట్రీలో పది సంవత్సరాలు పాటు హీరోయిన్ గా కొనసాగినటువంటి మధుబాల అనంతరం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తిరిగి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే స్వీట్ కారం కాఫీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Madhu Bala) ఈమె సినిమాలకు ఎందుకు దూరమయ్యారనే విషయాల గురించి చెప్పుకొచ్చారు.1991లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు అనంతరం పలు తెలుగు తమిళ భాషలలో నటించారు. ఇలా అజయ్ దేవగన్ తో కలిసి తన కెరియర్ మొదలుపెట్టినటువంటి ఈమెకు తిరిగి బాలీవుడ్ సినిమాలో అజయ్ దేవగన్ కు తల్లి పాత్రలో నటించే అవకాశాన్ని కల్పించారట.

ఇలా అజయ్ దేవగన్ తో సమాన వయసు ఉన్నటువంటి తనకు ఏకంగా తన తల్లి పాత్రలో నటించే అవకాశం రావడంతో అది నచ్చక తాను ఆ సినిమాలలో నటించనని చెప్పేసాను అంటూ ఈమె తెలియజేశారు. ఇండస్ట్రీలో సినిమాలు చేయాలనిపించలేదు అందుకు ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం వెతికితే పెళ్లి కారణం అనిపించింది వెంటనే తనకు తెలిసిన వారందరికీ లెటర్స్ రాసి తాను సినిమాలలో నటించనని చెప్పినట్లు మధుబాల పేర్కొన్నారు.

అప్పట్లో హీరోయిన్స్ కి పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదని అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయని, సీనియర్ హీరోయిన్లకు కూడా సినిమాలలో అవకాశాలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది అంటూ మధుబాల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus