Rudrangi Review in Telugu: రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • జగపతి బాబు (Hero)
  • విమలా రామన్, మమతా మోహన్ దాస్, (Heroine)
  • ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, కాలకేయ ప్రభాకర్, ఆర్ఎస్ నంద తదితరులు (Cast)
  • అజయ్ సామ్రాట్ (Director)
  • ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ (Producer)
  • నాఫల్ రాజా (Music)
  • ఎన్.సుధాకర్ రెడ్డి (Cinematography)
  • Release Date : జులై 07, 2023

‘లెజెండ్’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జగపతి బాబు.. ఆ తర్వాత వరుసగా పెద్ద బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ లలో తెరకెక్కుతున్న బడా ప్రాజెక్టుల్లో విలక్షణ నటుడిగా, విలన్ గా జగపతి బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత జగపతి బాబు ప్రధాన పాత్రలో ఓ సినిమా రూపొందింది. అదే ‘రుద్రంగి’. ఈ మూవీతో మమత మోహన్ దాస్, విమలా రామన్ వంటి సీనియర్ హీరోయిన్లు కూడా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘బాహుబలి’ కి డైలాగ్ రైటర్ గా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇన్ని విశేషాలు సంతరించుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : మల్లేష్( ఆశిష్ గాంధీ) , గానవి లక్ష్మణ్(రుద్రంగి) ఇద్దరూ బావ మరదలు. ఇద్దరూ చిన్నప్పుడే తమ తల్లిదండ్రులను పోగొట్టుకుంటే తన తాత చేరదీసి పెంచుతాడు. అయితే ఆ ఊరి దొర(కాలకేయ ప్రభాకర్) మల్లేష్, రుద్రంగి ల తాతని చంపేస్తాడు. ఆ టైంలో వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు దూరమవుతారు. మరోపక్క భీమ్ రావు దేశ్ ముఖ్ (జగపతి బాబు) అదే ఊరికి ఇంకో దొర. ఇతని పై కాలకేయ ప్రభాకర్ మనుషులు దాడి చేస్తే.. మల్లేష్ అతన్ని కాపాడతాడు.

దీంతో అతన్ని భీమ్ రావు దేశ్ ముఖ్ చేరదీసి పెంచుతాడు. ఇద్దరికీ శత్రువు అయిన కాలకేయ ప్రభాకర్ పాత్రని చంపేస్తారు. అలా అని భీమ్ రావు దేశ్ ముఖ్ కూడా మంచి వాడు కాదు. అతను కూడా జనాలను పీడిస్తూ.. తన ఊరి అమ్మాయిలను బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నా అలాంటి ఘోరమైన పనులు చేస్తుంటాడు.

అతని మొదటి భార్య మీరా బాయ్ (విమలా రామన్) , రెండో భార్య జ్వాలా భాయ్ (మమతా మోహన్ దాస్) వంటి వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మరోపక్క అతని చూపు మల్లేష్ భార్య రుద్రంగి పై పడుతుంది. దీంతో మల్లేష్ – భీమ్ రావు దేశ్ ముఖ్ లు శత్రువులు అవుతారు. అయినా సరే ఆమెను ఎలాగైనా అనుభవించాలి అని చాలా ఘోరమైన పనులు చేస్తాడు భీమ్ రావు దేశ్ ముఖ్. చివరికి ఏమైంది అనేది కథ?

నటీనటుల పనితీరు : సినిమా ఫస్ట్ హాఫ్ లో అందరి కంటే ఎక్కువ హైలెట్ అయ్యింది జ్వాలా భాయ్ పాత్ర చేసిన మమతా మోహన్ దాస్ అని చెప్పాలి. ఆమె గ్లామర్, వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఆశిష్ గాంధీ కూడా మల్లేష్ పాత్రలో బాగా చేశాడు. అతనికి మరిన్ని మంచి పాత్రలు రావచ్చు. మీరా బాయ్ పాత్రలో విమలా రామన్ పర్వాలేదు అనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో ఈమె నటన ఆకట్టుకుంటుంది.

టైటిల్ రోల్ పోషించిన గానవి లక్ష్మణ్ కూడా బాగా చేసింది. సెకండ్ హాఫ్ లో మాత్రం జగపతి బాబు వన్ మెన్ షో చేసేశాడు అని చెప్పాలి. క్రూరంగా కనిపించినా అక్కడక్కడా కామెడీ కూడా చేశాడు. మిగిలిన వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘బాహుబలి’ కి డైలాగ్ రైటర్ గా చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకుడు. ఒకప్పుడు దొరలు ఆధిపత్యం చెలాయించడం, సామాన్యులను అణగదొక్కడం వంటివి ఈ సినిమాలో చాలా సహజంగా చూపించాడు. అలా అని సినిమాకి ఉండాల్సిన లిబర్టీస్ ను అతను పక్కదోవ పట్టించింది లేదు. ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపించిన అతను సెకండాఫ్ ఆరంభంలో బోర్ కొట్టించాడు. అయితే క్లైమాక్స్ ను మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దాడు.

మరీ ముఖ్యంగా జగపతి బాబు పాత్రకి అతను ఇచ్చిన ఎండింగ్ గుర్తుండిపోయే విధంగా ఉంది అని చెప్పాలి. నాఫల్ రాజా సంగీతంలో రూపొందిన పాటలు ఎక్కువగా రిజిస్టర్ కావు. నేపధ్య సంగీతం పర్వాలేదు. ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టున్నాయి.

విశ్లేషణ : సెకండ్ హాఫ్ లో వచ్చే బోరింగ్ సన్నివేశాలు పక్కన పెడితే.. ఫస్ట్ హాఫ్ అలాగే క్లైమాక్స్ పోర్షన్స్ తో ‘రుద్రంగి’ ఈజీగా పాస్ మార్కులు వేయించుకుంటుంది. ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే.. ఒకసారి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది.

రేటింగ్ : 2/5

Click Here To Read in ENGLISH

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus