Roja, Meena: రోజా, మీనా ల వింటేజ్ లుక్.. వైరల్ గా మారిన పిక్..!

  • July 23, 2021 / 04:15 PM IST

మీనా,రోజా ఇద్దరూ గతంలో టాలీవుడ్ ను తమ గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లే..! వీళ్ళిద్దరూ కలిసి తమిళంలో రజినీ కాంత్ తో ‘అల్లరి మొగుడు’ రీమేక్ అయిన ‘వీర’ మూవీలో నటించారు. అలాగే తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘బొబ్బిలి సింహం’, చిరంజీవి హీరోగా వచ్చిన ‘ముఠామేస్త్రి’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు.ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు ఈ భామలు.

సినిమాల పరంగానే కాకుండా నిజజీవితంలో కూడా వీళ్ళు మంచి స్నేహితులన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.ఇదిలా ఉండగా.. తాజాగా మీనా.. రోజాతో దిగిన ఓ పాత ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా కూడా మారింది. 1993వ సంవత్సరంలో తీసిన ఫోటో ఇదని తెలుస్తుంది. ఆ టైంలో మీనా… నాగార్జున-దర్శకుడు కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అల్లరి అల్లుడు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. మరో పక్క రోజా.. చిరంజీవి ట్రిపుల్ రోల్ ప్లే చేస్తున్న ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో నటిస్తున్నారు.

ఈ రెండు చిత్రాల షూటింగ్ లు ఒకే చోట జరుగుతున్న సందర్భంలో రోజా,మీనా లు ఈ ఫోటో దిగినట్టు స్ఫష్టమవుతుంది.ఈ ఫొటోను మీనా షేర్ చేస్తూ..” ‘అల్లరి అల్లుడు’ షూటింగ్‌లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్లోనే షూటింగ్‌ జరుపుకుంటోన్న ‘ముగ్గురు మొనగాళ్లు’ సెట్‌ ను సందర్శించినప్పుడు, ‘రాజశేఖర’ పాట నాకు ఎంతో ఇష్టం’ అంటూ క్యాప్షన్‌ కామెంట్ చేసింది మీనా. ఆ టైములో మీనా ‘ముగ్గురు మొనగాళ్లు’ సెట్ కి వెళ్ళినప్పుడు ఆ పాటని చిత్రీకరిస్తున్నారన్న మాట. రోజా గెటప్ కూడా ఆ పాటకి సంబంధించినదని తెలుస్తుంది.28 ఏళ్ల క్రితం తీసుకున్న ఫోటో ఇదని కూడా స్పష్టమవుతుంది.


Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus