Actress Meena: నాలాంటి పరిస్థితి మరెవరికి రాకూడదు: మీనా

  • August 15, 2022 / 01:33 PM IST

తెలుగు తమిళ భాషలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా భర్త విద్యాసాగర్ జూన్ 29వ తేదీ ఊపిరితిత్తుల సమస్యతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విద్యాసాగర్ మృతి చెందడంతో మీనా ఎంతగానో కృంగిపోయింది. మీనా భర్త మరణం అనంతరం పలువురు సెలబ్రిటీలు తన ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శిస్తూ తనకు మనోధైర్యం చెప్పారు. అయితే మీనా ఇప్పుడిప్పుడే తన భర్త జ్ఞాపకాల నుంచి మెల్లిగా బయటపడి తిరిగి మామూలు మనిషి అవుతున్నట్టు తెలుస్తుంది.

ఇకపోతే తన భర్త మరణం తర్వాత మీనా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 13 అంతర్జాతీయ అవయవ దాన దినోత్సవం కావడంతో ఈమె ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.తన భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అవయవాలు దానం చేసేవారు లేక మృతి చెందడంతో తన భర్త లాగా మరొకరు మృతి చెందకూడదని, తనలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని ఈమె తన మరణాంతరం తన అవయవాలను దానం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఈ సందర్భంగా మీనా ఒక పోస్ట్ చేస్తూ తాను అవయవాలను దానం చేస్తున్నానని ఒక మనిషి ప్రాణం కాపాడటం కన్నా గొప్ప పని ఏదీ లేదంటూ ఈమె చెప్పుకొచ్చారు.ఒక మనిషి చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయటం వల్ల ఎనిమిది మంది ప్రాణాలను కాపాడువచ్చట. ఇలా తన భర్తకు అవయవాలు దానం చేసేవారు లేకే తన భర్తను కోల్పోయానని లేకపోతే తన భర్త తనతో పాటే ఉండే వారని ఈమె తెలిపారు.

ఇలా నాలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనే ఉద్దేశంతోనే తన మరణాంతరం తన అవయవాలను డొనేట్ చేస్తున్నట్లు మీనా ఈ సందర్భంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకొని ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం మీనా చేస్తున్న ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎంతోమంది మీనా తీసుకున్న గొప్ప నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

1

2

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus