క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

ప్రతి ఏడాది కొత్త డైరెక్టర్లు ఎంట్రీ ఇవ్వడం సహజం.అయితే అందులో ఎంతమంది సక్సెస్ అవుతారు అన్నది మెయిన్ పాయింట్. మొదటి సినిమాతో కనుక ప్రేక్షకులను మెప్పిస్తే.. రెండో సినిమాకి క్రేజ్ ఉన్న హీరోలు అవకాశాలు ఇస్తారు. లేదంటే.. వాళ్లకు రెండో అవకాశం అంత ఈజీగా దొరకదు. అలా రెండో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న డైరెక్టర్లలో చాలా మంది మిడ్ రేంజ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. మరికొంతమంది అయితే పెద్ద బ్యానర్లలో, పెద్ద డైరెక్టర్ల దర్శకత్వ పర్యవేక్షణలో డెబ్యూ ఇస్తున్నారు. కాబట్టి మొదటి సినిమాకే క్రేజీ ప్రాజెక్టులు దక్కించుకున్నారని చెప్పొచ్చు. ఆ దర్శకులు ఎవరు? వాళ్లకు దక్కిన క్రేజీ ప్రాజెక్టులు ఏంటి? వాళ్ళ డెబ్యూ మూవీతో హిట్లు కొడతారా లేదా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) శరత్ మండవ :

ఇతను దర్శకత్వానికి కొత్త కాదు. ఆల్రెడీ తమిళంలో ‘కో 2’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా బాగానే ఆడింది. తెలుగులో మాత్రం డెబ్యూ మూవీ అనే చెప్పాలి. రవితేజతో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. జూలై 29న ఆ మూవీ రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ వంటివి ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. తన మొదటి సినిమాకే ఇలాంటి కాంబినేషన్ సెట్ అవ్వడం అంటే మాటలు కాదు. మరి ఈ చిత్రంతో అతను ఎంత వరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.

2) ఎం.ఎస్.రాజ శేఖర్ రెడ్డి :

‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజర్, పాటలు అన్నీ బాగున్నాయి. ఇతను కొన్ని కాంట్రవర్సీల్లో కూడా ఇరుక్కున్నాడు. కానీ సినిమాపై అయితే పాజిటివ్ బజ్ ఉంది. హిట్టు కొట్టి దర్శకుడిగా నిలబడతాడా లేదా అనేది చూడాలి.

3) మల్లిడి వశిష్ట్ :

కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన చారిత్రాత్మక చిత్రం ‘బింబిసార’.అతని కెరీర్లో హై బడ్జెట్ మూవీ కూడా ఇదే. మల్లిడి వశిష్ట్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మొదటి సినిమాకే ఇలాంటి పెద్ద ప్రాజెక్టు సెట్ అవ్వడం అంటే మాటలు కూడా కాదు. టీజర్, ట్రైలర్ వంటివి యూట్యూబ్ ను ఉతికి అరుస్తున్నాయి. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇతను స్టార్ డైరెక్టర్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.

4) శ్రీకాంత్ ఓడెల :

నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ చిత్రానికి ఇతనే దర్శకుడు. ఇదే అతనికి మొదటి చిత్రం. కానీ నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ‘దసరా’ రూపొందుతుంది. సినిమా కనుక హిట్ అయితే ఇతను కూడా టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయం.

5) గారీ బి హెచ్ :

టాలీవుడ్లో ఇతను ఓ టాప్ ఎడిటర్ అన్న సంగతి తెలిసిందే. ‘క్షణం’ ‘గూఢచారి’ ‘ఎవరు’ ‘హిట్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశాడు. ఇప్పుడు డైరెక్టర్ గా మారి నిఖిల్ తో ‘స్పై’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మొన్నామధ్య రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇతను కూడా క్రేజీ డైరెక్టర్ అయిపోతాడు.

6) శ్రీకాంత్ ఎన్ రెడ్డి :

మంచు మనోజ్ తో ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రాన్ని మొదలుపెట్టిన ఈ దర్శకుడు. అది ఆలస్యం కావడంతో పంజా వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా మొదలుపెట్టాడు. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఇది కూడా క్రేజీ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇతను కూడా టాప్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

7) గిరీశాయ :

‘అర్జున్ రెడ్డి’ ని తమిళ్ లో ‘ఆదిత్య వర్మ’ గా రీమేక్ చేసి ఓ డీసెంట్ హిట్ అందుకున్నాడు. తెలుగులో ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టీజర్, పాటలు బాగున్నాయి. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇతను కూడా టాప్ డైరెక్టర్ అయిపోయినట్టే..!

8) చంద్రశేఖర్ టి రమేష్ :

‘కప్పెల’ తెలుగు రీమేక్ ను ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా క్రేజీ ప్రాజెక్టు అనే చెప్పాలి. ఈ సినిమా కనుక హిట్ అయితే ఇతను కూడా డైరెక్టర్ గా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి.

9) విశాల్ కాశి :

సుకుమార్ శిష్యుడు ఇతను. దిల్ రాజు సోదరుడు కొడుకు ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న ‘సెల్ఫిష్’ అనే మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా క్రేజీ ప్రాజెక్టు అనే చెప్పాలి. మరి దర్శకుడు విశాల్ ఈ మూవీతో హిట్టు కొడతాడో లేదో చూడాలి.

10) కళ్యాణ్ శంకర్ :

నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ఇతను డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నిర్మిస్తున్న ఈ మూవీ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా కనుక హిట్ అయితే కళ్యాణ్ శంకర్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus