Actress Mehreen: వరుస సినిమాలకు సంతకం చేస్తున్న మెహరీన్‌!

  • August 19, 2021 / 02:54 PM IST

అనుకోని కారణాల వల్ల పెళ్లి రద్దు అయిన తర్వాత… ఆ అమ్మాయి దిగాలు పడిపోతుంది అంటుంటారు. మన చుట్టుపక్కల ఇలాంటి పరిస్థితి చూసే ఉంటారు. అయితే కొంతమంది సినిమా హీరోయిన్ల విషయంలో ఇందుకు రివర్స్‌గా జరుగుతుంటుంది. పెళ్లి రద్దు అయిన తర్వాత వరుస సినిమా ఛాన్స్‌లు కొట్టేస్తుంటారు. తాజాగా అలాంటి జోరు చూపిస్తోంది మెహరీన్‌. తెలుగులో వరుస అవకాశాలు సాధించిన మెహరీన్‌… ఇప్పుడు కన్నడలోకి వెళ్తోంది. పంజాబ్‌కు చెందిన భవ్య అనే కుర్రాడితో ప్రేమలో పడి,

పెళ్లి చేసుకుందామని నిశ్చితార్థం కూడా చేసుకుంది మెహ్రీన్‌. అయితే పెళ్లి ఇంకొన్ని రోజులు ఉంది అనగానే బ్రేకప్‌ అనౌన్స్‌మెంట్‌ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఎంగేజ్‌మెంట్‌ కంటే ముందు ఓకే చేసిన సినిమాల కంటే ఎక్కువ కావడం గమనార్హం. పెళ్లి అనౌన్స్‌మెంట్‌ ముందు ‘ఎఫ్ 3’ మినహా మెహరీన్‌ చేతిలో సినిమాలేమీ లేవు. అయితే పెళ్లి రద్దు చేసుకోగానే కొన్ని రోజుల్లోనే ఆమె చేతికి రెండు కొత్త సినిమాలొచ్చాయి.

అందులో ఒకటి ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ సరసన మెహ్రీన్ నటించిన చిత్రమిది. కేవలం నెలన్నర రోజుల్లో సినిమా పూర్తి చేశారు. త్వరలోనే సినిమా విడుదల చేస్తారు. తాజాగా కన్నడ స్టార్‌ హీరో శివరాజ్ కుమార్‌తో నటిస్తోంది. కన్నడలో ఎంట్రీయే శివరాజ్ కుమార్ సినిమాతో కావడం మెహరీన్‌ అదృష్టమే అంటున్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus