క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

‘శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్’ పతాకంపై డెబ్యూ డైరెక్టర్ అనిల్ పంగులూరి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘క్షీర సాగర మథనం’. మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్. ప్రదీప్ రుద్ర విలన్ గా నటించారు. ఇతర పాత్రల్లో చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు కనిపించారు. కష్టాలకు భయపడి ఆగిపోతే జీవన మకరందాన్ని ఆస్వాదించలేం… జీవితంలో ఏమీ సాదించలేమనే థీమ్ తో ఈ చిత్రం రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ఇదొకటి. మరి ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి.

కథ: రిషి(మానస్ నాగులపల్లి), ఓంకార్(సంజయ్ కుమార్) మరో ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఓ పార్టీకి పిలిచి… విలన్(ప్రదీప్ రుద్ర) వారి బాడీలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ఓ డివైజ్ ను అమర్చి… ఆ ఐదు మందిని మానవ బాంబులుగా మార్చి… భారీ పేలుడుకు పక్కా ప్లాన్ వేస్తాడు. ఈ 5 మంది కూడా వాళ్ల వాళ్ల సొంత సమస్యలతో బాధపడుతూ… ఉంటూ..చివరికి ఓ మానవ బాంబుగా మారిపోయామని తెలుసుకుని చివరకు ఏమి చేశారన్నది మిగిలిన కథ.

నటీనటులు మరియు సాంకేంతిక నిపుణుల పనితీరు : ఏడు పాత్రల భావోద్వేగాలతో ముడిపడిన కథ ఇది. ‘క్యారెక్టర్.. వర్జినిటీ ఒక్కటే అయితే… డిక్ష్ణరిలో ఎందుకు ఈ రెండు పదాలు వుంటాయి?’. వంటి డైలాగులను దర్శకుడు బాగానే రాసుకున్నాడు.ఓ కొత్త పాయింట్ ను అయితే బాగానే అనుకున్నాడు కానీ దానిని ఆవిష్కరించడంలో అతను తడబడ్డాడు. ఎన్ని కష్టాలొచ్చినా… వాటిని ధైర్యంగా ఫేస్ చేసి ముందుకు సాగాలనే కాన్సెప్ట్ ను అతను కొత్తగా డిజైన్ చేసుకున్న మాట నిజమే.

కానీ ఎంటర్టైనింగ్ గా… ఎమోషనల్ గా అతను పూర్తి స్థాయిలో మలచలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా అనిపిస్తుంది.ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ పర్వాలేదు.గోవింద్… వ్రిందాల మధ్య వచ్చే సీన్స్, రిషి.. ఇషికల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఎపిసోడ్స్ ఓకే అనిపిస్తాయి. భరత్ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ‘సాఫ్ట్ వేర్ రంగంలో ఎంతో టాలెంట్ వున్నా… టీ కొట్టు గానీ.. బజ్జి కొట్టుగానీ పెట్టుకుంటా గానీ… ఈ సాప్ట్ వేర్ జాబ్ మాత్రం చేయాలేనని చెప్పే భరత్ క్యారెక్టర్’… నేటి సాప్ట్ వేర్ వుద్యోగులు ఎదుర్కొంటున్న జాబ్ ఒత్తిడిని తెలియజేస్తుంది. దర్శకుడు అనిల్ సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన వాడు కాబట్టి తన అనుభవాన్ని ఈ పాత్ర ద్వారా తెలిపినట్టు ఉంది.

ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది. సెకెండ్ హాఫ్ ఓకే అనిపిస్తుంది.దర్శకుడు అనిల్ కు ఇది డెబ్యూ మూవీ కాబట్టి అతను మంచి థీమ్ ను అనుకున్నా పూర్తిస్థాయిలో దానిని ఎలివేట్ చేయలేకపోయాడు. ఏడు పాత్రల తాలూకు భావోద్వేగ సంఘర్షణల మథనానికి “క్షీర సాగర మథనం” అనే అందమైన టైటిల్ ని బాగానే పెట్టాడు కానీ.. కాస్త పేరుగాంచిన క్యాస్టింగ్ ను అతను ఎంచుకుని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లకు మంచి మార్కులే వేయొచ్చు. ఎడిటింగ్ లో లోపాలు చాలానే కనిపించాయి. ఫస్ట్ హాఫ్ పై, క్లయిమాక్స్ పై దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

విశ్లేషణ : ‘క్షీర సాగర మథనం’ థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తారని పూర్తిగా చెప్పలేము.ఇంట్రెస్టింగ్ థీమ్,ఓకే అనిపించే సెకండ్ హాఫ్ కోసం ఓటిటిలో రిలీజ్ అయ్యాక అయితే ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus