Nayanthara: నయనతారను, పిల్లల్ని చూడగానే అవి అన్నీ మరిచిపోతాను!

నయనతార విఘ్నేష్ శివన్ జోడీకి టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి పేరు ఉంది. నయన్ హీరోయిన్ గా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. ఈరోజు నయన్ విఘ్నేష్ పెళ్లిరోజు కాగా విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నువ్వు నా లైఫ్ లోకి వచ్చి ఏడాది అయిపోయిందని విఘ్నేష్ శివన్ అన్నారు. గడిచిన ఏడాది కాలంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని విఘ్నేష్ శివన్ వెల్లడించారు.

ఏడాది కాలంలో ఎన్నో పరీక్షలు, ఊహించని పరాజయాలు ఎదురయ్యాయని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. ఇలాంటి చికాకులు ఎన్నో ఉన్నప్పటికీ నయనతారను, పిల్లలను చూసిన వెంటనే అన్నీ మరిచిపోతానని ఆయన కామెంట్లు చేశారు. వీళ్లను చూడగానే నాలో అత్మవిశ్వాసం పెరుగుతుందని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. కుటుంబం ఇచ్చే బలం మరేదీ ఇవ్వలేదని విఘ్నేష్ శివన్ కామెంట్లు చేశారు. మన పిల్లలు ఉయిర్, ఉరగమ్ లకు మంచి లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని విఘ్నేష్ శివన్ పేర్కొన్నారు.

(Nayanthara) నయనతారను నిన్ననే పెళ్లి చేసుకున్నట్టు ఉందని విఘ్నేష్ శివన్ వెల్లడించారు. అప్పుడే సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నానని విఘ్నేష్ శివన్ కామెంట్లు చేయడం గమనార్హం. మనమిద్దరం కలిసి సాధించాల్సినవి చాలా ఉన్నాయని విఘ్నేష్ శివన్ అన్నారు. మన ఆనందమైన లైఫ్ లోకి మరో ఏడాది స్వాగతం పలుకుదామని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చారు. విఘ్నేష్ శివన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నయనతారపై విఘ్నేష్ శివన్ చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నయన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. నయనతార ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. నయనతారకు సోషల్ మీడియాలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. నయనతార ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus