Stars: ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

ఎంతమంది ఎన్ని సాధించిన, ఎంత సంపాదించినా, ఎంత గొప్పగా బ్రతికినా.. చివరికి చావు నుండి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. దురదృష్టవశాత్తు కొంతమందికి అది ముందుగా వచ్చిన సందర్భాలు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏదో ఒక అనారోగ్య సమస్యతో మరణిస్తున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కొంతమంది ట్రీట్మెంట్ లేని వ్యాధులతో మరణిస్తున్నారు అంటే చాలా విచారకరం. ఇలాంటి వార్తలు చదివి ‘అయ్యో పాపం’ అనుకోవడం తప్ప.. సామాన్యులమైన మనం ఏమీ చేయలేము.

అయితే (Stars) మన స్టార్ హీరోలు మాత్రం ‘మమ్మల్ని కలిస్తే తాత్కాలికంగా అయినా ఆనందపడతారు’ అంటే.. అంతకంటే మాకు కావాల్సిందేముంది అంటూ సంతోషంగా వారికి టైం ఇచ్చి కలిసి, మాట్లాడి, వారి ఆనందాన్ని తీరుస్తున్నారు. ఇలా అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. వాళ్లెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) పవన్ కళ్యాణ్ :

2014 లో చిన్న వయసు కలిగిన పవన్ కళ్యాణ్ అభిమాని అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే.. ‘మేక్ ఎ విష్’ ఫౌండేషన్ వారు పవన్ కళ్యాణ్ ను సంప్రదించగా.., స్వయంగా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ కు వెళ్లి ఆ అభిమానిని కలిసి , చివరి కోరికను తీర్చాడు.

2) మహేష్ బాబు :

2015 లో కాకినాడకు చెందిన ఓ అభిమాని .. అరుదైన వ్యాధితో బాధపడుతుంటే, ఆ విషయాన్ని తెలుసుకున్న మహేష్ ఆ పిల్లాడిని అలాగే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ను కలిశాడు. అలాగే చివరి రోజులు గడుపుతున్న 106 ఏళ్ళ బామ్మ గారి చివరి కోరిక మేరకు కూడా మహేష్ వెళ్లి కలవడం జరిగింది.

3) ఎన్టీఆర్ :

బెంగళూరుకి చెందిన ఓ అభిమాని చివరి రోజులు గడుపుతుంటే.. తన కేరళ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్లి ఆ అభిమాని చివరి కోరికని తీర్చి వచ్చాడు ఎన్టీఆర్.

4) బాలకృష్ణ :

90 ఏళ్ళ వయసు కలిగిన ఓ పెద్దావిడ చివరి కోరికగా బాలయ్యని కలవాలని ఆశ పడింది. విషయం తెలుసుకున్న బాలకృష్ణ .. ఆమెను కలిసి మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పి వచ్చాడు.

5) ధనుష్ :

క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ అభిమానిని వెళ్లి కలిసి.. తన కళ్ళలో ఆనందం చూసే వరకు మాట్లాడి వచ్చాడు ఈ తమిళ స్టార్ హీరో.

6) అల్లు అర్జున్ :

65 ఏళ్ళ వృద్ధురాలు అల్లు అర్జున్ ను కలవాలని ఆశపడితే.. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెళ్లి ఆమెను కలిసి వచ్చాడు.

7) సూర్య :

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అయిన ఓ బాబుని కలిసొచ్చాడు సూర్య.

8) ప్రభాస్ :

ప్రభాస్ గురించి చెప్పడానికి ఒకటి, రెండు కాదు చాలా ఉన్నాయి. గతంలో ఓ అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్న టైంలో వెళ్లి అతన్ని కలిసొచ్చాడు. అలాగే ఇటీవల కన్నయ్య అలియాస్ రంజిత్ ను కూడా కలిసి అతనితో ఆప్యాయంగా మాట్లాడి పంపించాడు ప్రభాస్.

9) శృతి హాసన్ :

క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని శీతల్ ను కలిసి ఆమెతో మాట్లాడి ఆనందింపజేసింది శృతి హాసన్.

10) రామ్ :

అనారోగ్యంతో బాధపడుతున్న 5 ఏళ్ళ పాపని కలిసి సంతోషపెట్టాడు రామ్.

11) విక్టరీ వెంకటేష్ :

బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానిని కలిసి అతనికి ధైర్యం చెప్పొచ్చాడు వెంకటేష్. ‘వెంకీ మామ’ షూటింగ్ స్పాట్ నుండి ఆ అభిమానిని కలిసొచ్చాడు వెంకటేష్.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus