Nidhhi Agerwal: పవన్ సినిమా తరువాత మరో స్టార్ హీరోతో..?

  • May 6, 2021 / 02:52 PM IST

బాలీవుడ్ ముద్దుగున్న నిధి అగర్వాల్ ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు సరైన సక్సెస్ అందుకోకపోవడంతో అమ్మడు డీలా పడింది. ఆ తరువాత నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఈ సినిమా తరువాత నిధికి ఏకంగా పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది.

క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నిధి మహారాణి రోల్ లో కనిపించనుందని టాక్. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిధి జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న మహేష్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నారు. ఈ నెలాఖరులో సినిమా పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించే అవకాశాలున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ గత రెండు సినిమాల్లో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నారు. ఈ సినిమాలో కూడా ఆమెనే తీసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ పూజా డేట్స్ ప్రస్తుతానికి ఖాళీ లేవు. తమిళంలో విజయ్ తో కలిసి నటించే సినిమా కోసం అమ్మడు బల్క్ డేట్స్ ఇచ్చేసింది. అంతేకాకుండా వేరే కమిట్మెంట్స్ కూడా ఉండడంతో ఆమెకి బదులుగా ఫామ్ లో ఉన్న నిధిని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే నిజమైతే పవన్, మహేష్ లతో నటించబోతున్న నిధి అగర్వాల్ టాప్ లీగ్ లోకి వెళ్లడం ఖాయం!

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus