Pavitra Lokesh: తన భర్త గురించి పవిత్ర ఎంత గొప్పగా చెప్పిందో.. వైరల్ అవుతున్న ఓల్డ్ కామెంట్స్..!

  • January 28, 2023 / 08:57 PM IST

పవిత్ర లోకేష్‌.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా మంచి పేరు సంపాదించుకుంది. తల్లి, అత్త, పిన్ని, వదిన వంటి పాత్రలతో ఈమె చాలా మంచి పేరు సంపాదించుకుంది. ఈమె సినిమాల్లో చాలా పద్దతిగా కనిపిస్తుంది. ఈమెను చూడగానే అందరికీ ఓ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. చూడచక్కనైన రూపం ఈమె సొంతం. అయితే సీనియర్‌ హీరో నరేష్‌తో ఈమె సహజీవనం చేస్తుండడం.. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్యతో వాగ్వివాదాలకు దిగడం వంటివి ఈమె పై నెగిటివిటీ పెరిగేలా చేశాయి.

ఇప్పటికే మూడు సార్లు విడాకులు తీసుకున్న సీనియర్‌ నటుడు నరేష్‌ని.. పవిత్ర 4వ పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది తర్వాత సంగతి. వీరి పెళ్లి జరిగే అవకాశాలు అయితే లేవు అన్నది కొంతమంది నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే పవిత్ర మాటల పై జనాలకు నమ్మకం లేకపోవడం. ఆ మాటకు వస్తే నరేష్ మాటల పై కూడా జనాలకు నమ్మకం లేదు. ఎందుకంటే నరేష్.. గతంలో తన మూడో భార్య రమ్య రఘుపతి గురించి చాలా గొప్పగా చెప్పాడు.

కానీ ఇప్పుడు ఆ మాటలు లేవు. సరిగ్గా పవిత్ర కూడా ఇంతే.. గతంలో ఈమె తన సుచేంద్ర ప్రసాద్‌ దేవుడు అన్నట్టు చెప్పుకొచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర.. తన భర్త సుచేంద్ర ప్రసాద్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘మేమిద్దరం కలిసి ఓ సీరియల్‌లో నటించాం. అప్పుడు మా మధ్య ఏర్పడింది స్నేహమో, ప్రేమో, గౌరవమో తెలియదు గానీ.. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానంతో పెళ్లి చేసుకున్నాం. సుచేంద్ర ప్రసాద్ చాలా గొప్ప వ్యక్తి. నాతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా బెటర్ పర్సన్‌.

అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా నేను చూడలేదు. ఆయన నా అభిప్రాయాలను కూడా ఎంతో గౌరవిస్తారు.నా విషయంలో ఆయన చాలా పొసేసివ్‌గా వ్యవహరిస్తారు. నేను ఆయనకే సొంతమని భావిస్తారు. అందుకే, నా సినిమాలు కూడా చూసేవారు కాదు. చూడమని నేను కూడా ఏ రోజు ఒత్తిడి చేసింది లేదు.

నా సినిమాల్లో మీకు నచ్చిన చిత్రం ఏమిటని కూడా అడగలేదు. ఆయన కూడా తనకు ఏ సినిమా నచ్చిందనే విషయాన్ని చెప్పరు. ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాలు గురించి మేం మాట్లాడుకోము” అంటూ పవిత్ర చెప్పుకొచ్చింది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus