సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!

‘అద్భుతం జరిగే ముందు ఎవ్వరూ ఊచించలేరు. అద్భుతం జరిగాక ఊహించాల్సిన అవసరం ఉండదు’ ఇది సూపర్ స్టార్ కృష్ణ.. బ్రతికుండే రోజుల్లో ఎప్పుడూ చెప్తుండేవారు. ఇదే డైలాగ్ ను త్రివిక్రమ్.. తన ‘ఖలేజా’ సినిమాలో కూడా పెట్టుకున్నాడు. నిజమే అద్భుతం జరిగే ముందు అస్సలు ఎవ్వరూ ఊహించలేరు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే. సంక్రాంతి సీజన్లో చాలా మంది పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ ఒకే పండుగకు రెండేసి సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసుకోలేరు.

అదీ సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు రెండేసి సినిమాలు రిలీజ్ చేయడం అసాధ్యం. అయితే కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఇది సాధ్యమైంది.అవును ఒకే సంక్రాంతికి కొంతమంది హీరోయిన్లకు సంబంధించి రెండేసి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) విజయశాంతి :

1988వ సంవత్సరంలో ఈమె హీరోయిన్ గా నటించిన చిరంజీవి ‘మంచి దొంగ’, బాలకృష్ణ ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ చిత్రాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు బాగానే ఆడాయి.

2) సౌందర్య :

2000వ సంవత్సరంలో సౌందర్య హీరోయిన్ గా నటించిన ‘అన్నయ్య’, ‘పోస్ట్ మాన్’ వంటి చిత్రాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. ఇందులో అన్నయ్య హిట్ అయ్యింది. పోస్ట్ మాన్ ప్లాప్ అయ్యింది.

3) సిమ్రాన్ :

2001 వ సంవత్సరంలో ఈమె నటించిన చిరంజీవి ‘మృగరాజు’, బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ చిత్రాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘నరసింహనాయుడు’ హిట్ అయ్యింది.. ‘మృగరాజు’ ప్లాప్ అయ్యింది.

4) సంగీత :

2003వ సంవత్సరంలో ఈమె రవితేజ ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’,శ్రీకాంత్ ‘పెళ్ళాం ఊరెళితే’ చిత్రాలతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ‘పెళ్ళాం ఊరెళితే’ హిట్ అయ్యింది. ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

5) శ్రీయ శరన్ :

2005 వ సంవత్సరంలో ఈమె పవన్ కళ్యాణ్ ‘బాలు’, ఎన్టీఆర్ ‘నా అల్లుడు’ చిత్రాలతో సంక్రాంతికి పలకరించింది. ఇందులో ‘బాలు’ యావరేజ్ గా ఆడింది.. ‘నా అల్లుడు’ ప్లాప్ అయ్యింది.

6) ఛార్మి :

2006 వ సంవత్సరం సంక్రాంతికి ‘స్టైల్’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘లక్ష్మీ’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఛార్మి. ఇందులో ‘చుక్కల్లో చంద్రుడు’ తప్ప మిగిలిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి.

7) కీర్తి సురేష్ :

2018 వ సంవత్సరం సంక్రాంతికి ‘అజ్ఞాతవాసి’, ‘గ్యాంగ్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఇవి రెండు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి అనే చెప్పాలి.

8) శృతి హాసన్ :

ఈ ఏడాది సంక్రాంతికి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ , చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఇవి రెండు కూడా హిట్ అయ్యాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus