Poojitha, Srija: మూడో పెళ్లి అంటే కుటుంబ పరువు పోయినట్టే!

నటి పూజిత ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం పై స్పందించిన ఈమె నరేష్ కి ఏమాత్రం తప్పులేదని రమ్య ఉద్దేశపూర్వకంగానే నరేష్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది అంటూ పూజిత కామెంట్ చేయడంతో ఒక్కసారిగా ఈమె పాపులర్ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా పూజిత మరోసారి మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకొని, ప్రస్తుతం తనకు విడాకులు ఇచ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తలపై మెగా కుటుంబం ఏ మాత్రం స్పందించలేదు. ఇక ఈ నేపథ్యంలోనే శ్రీజ మూడో పెళ్లికి కూడా సిద్ధమైందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా శ్రీజ మూడో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై నటి పూజిత స్పందించారు.శ్రీజ మూడవ వివాహం చేసుకుంటే మెగాస్టార్ చిరంజీవి పరువు మొత్తం పోతుందని ఆమె పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని పూజిత తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇకపోతే పెళ్లి విషయంలో శ్రీజకు స్థిరమైన ఆలోచనలు లేవని అందుకే ఇలా తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వస్తున్నాయని పూజిత పేర్కొన్నారు. ఇకపోతే మెగా కుటుంబంలో శ్రీజ అంటే అందరికీ ఎంతో ఇష్టం. అందుకే చిన్నప్పటినుంచి ఈమెను ఎంతో గారాబంగా పెంచారు.

ఈ గారాబమే ఇలాంటి పరిణామాలకు దారి తీస్తుందని ఆమెకు అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ లేదు అంటూ పూజిత శ్రీజ గురించి తెలియజేశారు. ఏది ఏమైనా ఈమె పెళ్లి ఆలోచన విరమించుకుంటేనే మంచిదని లేకపోతే కుటుంబ పరువు ప్రతిష్టలు మొత్తం పోతాయంటూ పూజిత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus